STOCKS

News


ఎర్నింగ్స్‌పై కన్నేయండి!

Wednesday 12th December 2018
news_main1544592112.png-22853

దాస్‌ నియామకం ముగిసిన కధ
క్యు3 ఫలితాలే ఇకపై మార్కెట్లకు ట్రిగ్గర్‌
బ్రోకరేజ్‌ల అంచనా
ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత్‌దాస్‌ నియామకాన్ని మార్కెట్లు జీర్ణించుకున్నాయని, ఇకపై సూచీల్లో అప్‌మూవ్‌కు ఎర్నింగ్సే ఆధారమని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఉర్జిత్‌పటేల్‌ రాజీనామా అనంతరం శక్తికాంత్‌దాస్‌ను మూడేళ్ల కాలపరిమితితో ఆర్‌బీఐకి గవర్నర్‌గా ప్రభుత్వం నియమించింది. మరికొన్ని రోజుల్లో ఆర్‌బీఐ కీలక మీటింగ్‌ జరగనుంది. ఉర్జిత్‌ రాజీనామా, దాస్‌ నియామకాన్ని మార్కెట్లు స్వాగతించినట్లు కనిపిస్తున్నాయని, ఇప్పటికే ఈ అంశాలను మార్కెట్లు ప్రైస్‌ఇన్‌ చేసుకున్నాయని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ చెప్పారు. ముడిచమురు ధరలు పతనం కావడం, ఎన్‌బీఎఫ్‌సీలకు ఊరట లభించే అవకాశాలు పెరగడంతో క్రిస్‌మస్‌ర్యాలీని ఆశించవచ్చని చెప్పారు. ముఖ్యంగా మిడ్‌క్యాప్స్‌లో రికవరీ ఉండవచ్చన్నారు. క్రూడాయిల్‌ధర స్వల్పకాలంలో దాదాపు 30 శాతం పతనమైంది. అంతర్జాతీయ మందగమన పరిస్థితులు కనిపిస్తున్నా ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నంత వరకు ఇబ్బంది ఉండదన్నారు. లిక్విడిటీ సమస్యలను చక్కదిద్దేందుకు దాస్‌ ప్రాధాన్యమిస్తారని అంచనా వేశారు. మరోమారు బ్యాంకులకు రీక్యాప్‌ అందించే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులన్నీ కలిపి మిడ్‌క్యాప్స్‌పై పాజిటివ్‌ ప్రభావం చూపుతాయని చెప్పారు. ఏడాది కనిష్ఠాలకు చేరిన ఎన్‌బీఎఫ్‌సీ, ఆటో స్టాకులపై దృష్టి పెట్టవచ్చని ఇన్వెస్టర్లకు సూచించారు. 
సరైన ఎంపిక
దాస్‌ ఇకపై తనను తాను నిరూపించుకోవాలని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సలహాదారు విజయ్‌కుమార్‌ చెప్పారు. విత్త, ఆర్థిక రంగాల్లో, టీమ్‌ మేనేజ్‌మెంట్‌లో ఆయనకు అపార అనుభవం ఉందన్నారు. ప్రభుత్వానికి ఆర్‌బీఐకి మధ్య నెలకొన్న అసహన వాతావరణాన్ని చక్కదిద్దడానికి కావల్సిన సామర్ధ్యం దాస్‌కు ఉందన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా దాస్‌ స్వతంత్రంగా వ్యవహరించాలని యాంబిట్‌ హోల్డింగ్స్‌ సీఈఓ అశోక్‌ వాద్వా సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పదవికి దాస్‌ సరైన ఎంపికన్నారు. ఇప్పటికిప్పుడు ఆయన కొత్తగా పరిస్థితులు మార్చేందుకు ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఈ అంశంపై ఇప్పటికే స్పందించాయని చెప్పారు. ఇకమీదట మార్కెట్లను నడిపించే శక్తి ఎర్నింగ్స్‌కే ఉందని తెలిపారు. క్యు3 ఫలితాలు అనుకున్నట్లుగా ఉంటే మార్కెట్లు మరింత ముందుకు సాగుతాయన్నారు. You may be interested

మల్టీ-బ్రాండ్‌లో 100% ఎఫ్‌డీఐలు అనుమతించాలి

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: మల్టీ-బ్రాండ్ రిటైల్ రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. అలాగే, మల్టీ-బ్రాండ్ రిటైల్‌ రంగ వృద్ధికి తోడ్పడేలా వ్యాపారాల నిర్వహణ నిబంధనలను మరింత సరళతరం చేయాలని కోరింది. కన్సల్టెన్సీ సంస్థ ఏటీ కియర్నీతో కలిసి రూపొందించిన జాతీయ రిటైల్ విధాన నివేదికలో సీఐఐ ఈ మేరకు సిఫార్సులు చేసింది. సంప్రదాయ, ఆధునిక రిటైల్‌ వ్యాపారాలు

టియాగో ఎక్స్‌జెడ్‌ ప్లస్‌ విడుదల

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ తన పాపులర్‌ వాహనం టియాగోలో కొత్త వేరియంట్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది.  ‘టియాగో ఎక్స్‌జెడ్‌ ప్లస్‌’ పేరుతో విడుదలైన ఈ కారు పెట్రోల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.5.57- 5.64 లక్షలు కాగా, డీజిల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.6.31- 6.38 లక్షలుగా ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్యాసింజర్‌ వాహన విభాగ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌, కస్టమర్‌ సపోర్ట్‌) ఎస్‌.ఎన్‌.బర్మన్‌

Most from this category