STOCKS

News


మరికొన్ని దిగుమతులపై సుంకాల పెంపు

Friday 12th October 2018
news_main1539319022.png-21078

న్యూఢిల్లీ: కరెంటు ఖాతా లోటు కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండో విడత కింద మరికొన్ని ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను పెంచింది. వీటిలో కమ్యూనికేషన్‌ ఉత్పత్తులు, బేస్‌ స్టేషన్‌, డిజిటల్‌ లైన్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి. వీటిపై సుంకాలను 10 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. కస్టమ్స్‌ టారిఫ్‌ చట్టం 1975లోని చాప్టర్‌ 85 కింద వచ్చే పలు వస్తువులపై దిగుమతి సుంకాలు విధించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించినట్టు పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ చాప్టర్‌ కింద ఎలక్ట్రికల్‌ మెషినరీ, ఎక్విప్‌మెంట్‌, సౌండ్‌ రికార్డర్లు, టెలివిజన్‌ ఇమేజ్‌ రికార్డర్లు, వీటి విడిభాగాలు ఉన్నాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషిన్లు, ఏసీలు సహా 19 రకాల దిగుమతులపై సుంకాలు పెంచుతూ గత నెల 26న కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 



You may be interested

టీసీఎస్‌ బోణీ భేష్‌!

Friday 12th October 2018

ముంబై: దేశీ సాఫ్ట్‌వేర్‌ అగ్రగామి టీసీఎస్‌ మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2018-19, క్యూ2) కంపెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.7,901 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం 6,446 కోట్లతో పోలిస్తే 22.6 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం 20.7 శాతం వృద్ధితో రూ. 30,541 కోట్ల నుంచి రూ.36,854 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా డాలరుతో రూపాయి

గూగుల్ ఇండియా లాభాలు 33% అప్‌

Friday 12th October 2018

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ భారత విభాగం ఆదాయాలు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.9,338 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.7,239 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. మరోవైపు, నికర లాభం 33 శాతం పెరిగి రూ. 307 కోట్ల నుంచి రూ. 407 కోట్లకు పెరిగింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ టోఫ్లర్‌ ఈ

Most from this category