STOCKS

News


క్రూడ్‌ ధరల అనూహ్య పతనం

Friday 30th November 2018
news_main1543554991.png-22511

న్యూయార్క్‌/న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరల అనూహ్యంగా భారీగా పతనం అయ్యాయి. రెండు నెలల క్రితం ఉన్న గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 30 డాలర్లు కిందకు దిగాయి. న్యూయార్క్‌ మర్కెంటైల్‌ ఎక్స్చేంజ్‌లో ట్రేడయ్యే లైట్‌ స్వీట్‌ బేరల్‌ ధర గురువారం ఒక దశలో 49.46 డాలర్ల స్థాయిని తాకింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి. రెండు నెలల క్రితం ఈ ధర 76.90 డాలర్ల వద్ద ఉంది. ఇక భారత్‌ ప్రధానంగా దిగుమతి చేసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ బేరల్‌ ధర గురువారం ట్రేడింగ్‌ ఒక దశలో 57.78ని తాకింది. రెండు నెలల క్రితం ఈ ధర 86.74 డాలర్ల వద్ద ఉంది. ఈ వార్త రాసే 10 గంటల సమయంలో నైమెక్స్‌, బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు వరుసగా 51.75, 60.17డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంతో మళ్లీ ప్రపంచం మాద్యంలోకి జారిపోయే అవకాశం ఉందన్న భయాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ వృద్ధి రేటు అంచనాలకు కోత వంటి అంశాలు క్రూడ్‌ పరుగును అడ్డుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో క్రూడ్‌ భారీ స్థాయిల్లో ఉండడం తగదన్న అమెరికా అధ్యక్షుని ప్రకటనలు, క్రూడ్‌ నిల్వలు పెరగడం వంటి అంశాలూ క్రూడ్‌ ధరలు దిగిరావడానికి కారణం. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పట్లో తిరిగి క్రూడ్‌ మళ్లీ 30 డాలర్లు పైకి ఎగసి, ఇటీవలి గరిష్ట స్థాయిలను చూడ్డం ‍కష్టమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అర్జెంటీనాలో ఈ వారాంతంలో జరగనున్న జీ-20 సమావేశం, చమురు ఉత్పత్తికి సంబంధించి రష్యాసహా ఒపెక్‌ దేశాలు అనుసరించబోయే విధానాలు భవిష్యత్‌  క్రూడ్‌ ధరలను నిర్దేశిస్తాయని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 



You may be interested

ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌4 శాతం వాటా విక్రయానికి ఎస్‌బీఐ ఓకే

Friday 30th November 2018

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 4 శాతం వాటా విక్రయానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలిపింది. రెండు ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌కు 4 శాతం వాటాకు సమానమైన 86.2 లక్షల షేర్లను విక్రయించడానికి ఎస్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ డీల్‌ విలువ రూ.482 కోట్లు. ఈ డీల్‌లో భాగంగా యాక్సిస్‌ న్యూ ఆపర్చునిటీస్‌ ఏఐఎఫ్‌-వన్‌  1.65 శాతం వాటా షేర్లను, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు చెందిన

నియంత్రణలు పెరిగిపోతున్నాయ్‌..

Friday 30th November 2018

ముంబై: వ్యాపార సంస్థలపై నియంత్రణలు పెరిగిపోతుండటంపై కార్పొరేట్ దిగ్గజాలు ఆనంద్ మహీంద్రా, ఉదయ్‌ కొటక్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నియంత్రణల వెనుక భావానికన్నా... భాషకే ప్రాధాన్యముంటోందని, నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేయడానికే ప్రాధాన్యమివ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. "నిబంధనలో స్పష్టత లేనప్పుడు భావాన్ని అనుసరించి ముందుకెడదామనుకుంటే.. వెంటనే లాగిపెట్టి ఒకటి కొడుతున్నారు. ఈ నిబంధనను తు.చ. తప్పకుండా పాటించావా లేదా అని ప్రశ్నిస్తున్నారు. నిబంధనల వెనుక భావాన్ని

Most from this category