STOCKS

News


ఎంఎస్‌ఈ రంగానికి రూ.1.23 లక్షల కోట్ల రుణాలు

Wednesday 5th December 2018
news_main1543984481.png-22638

ముంబై: చిన్న వ్యాపార సంస్థల(ఎంఎస్‌ఈ)కు రుణాల లభ్యతపై నెలకొన్న ఆందోళలన్నీ భ్రమలేనని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఈ రంగానికిచ్చే రుణాల్లో మంచి వృద్ధి ఉందని స్పష్టం చేశారు. 2017 జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన అనంతరం ఎంఎస్‌ఈ రంగానికి ఇచ్చే రుణాలు 1.23 లక్షల కోట్లకు పెరిగాయని, జీఎస్టీకి ముందున్న రూ.25,700 కోట్లతో పోలిస్తే ఐదు రెట్లు పెరిగినట్టు మంగళవారం విడుదల చేసిన నివేదికలో తెలిపారు. జీఎస్టీకి ముందు చిన్న మధ్య తరహా సంస్థలకు రుణాల పంపిణీ తగ్గడానికి ఆర్థిక రంగం నిదానించడం, ఎన్‌పీఏలు పెరిగిపోవడం, ఎంఎస్‌ఎంఈ విభాగంలోని ఆహార, ప్రాసెసింగ్‌ యూనిట్లను వ్యవసాయ రంగానికి చెందినవిగా పరిగణించడం వంటి కారణాలను పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ మొత్తం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీ రంగం వాటా 10 శాతంగా ఉన్నట్టు చెప్పారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి ఇచ్చిన రుణాలను వర్గీకరించే విషయంలో బ్యాంకులు ఓర్పుతో వహించాలని ఆర్‌బీఐ అక్టోబర్‌ నాటి పాలసీ భేటీ సందర్భంగా కోరిన విషయం తెలిసిందే. 



You may be interested

సుంకాల వివాదాలపై డబ్ల్యూటీవో ప్రత్యేక కమిటీ

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: ఉక్కు, అల్యూమినియం దిగుమతి సుంకాల విషయంలో అమెరికాతో తలెత్తే వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్న భారత్ అభ్యర్థనపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సానుకూలంగా స్పందించింది. కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. నిర్దిష్ట ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న అదనపు సుంకాలు అంతర్జాతీయ ఒడంబడికలకు అనుగుణంగా ఉన్నాయా లేక విరుద్ధంగా ఉన్నాయా అన్న అంశాన్ని ఇది పరిశీలిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక చర్చల ద్వారా ఇరు

ఇసుజు మోటార్స్‌ ధరలు పెరుగుతాయ్‌

Wednesday 5th December 2018

ముంబై: జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్స్‌ కంపెనీ భారత్‌లో విక్రయించే తన వాహనాల ధరలను రూ.లక్ష వరకూ పెంచుతోంది. పెంచిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని ఇసుజు మోటార్స్‌ తెలియజేసింది. ఉత్పత్తి, పంపిణి వ్యయాలు పెరిగిపోవడంతో ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది. వాణిజ్య వాహనాల ధరలను 1-2 శాతం రేంజ్‌లో, లైఫ్‌స్టైల్‌, అడ్వైంచర్‌ పిక్‌-అప్‌ వాహనాల ధరలను 3-4 శాతం రేంజ్‌లో పెంచనున్నామని వెల్లడించింది.

Most from this category