STOCKS

News


క్రెడిట్‌ గ్రోత్‌ అంతంతే!

Saturday 8th June 2019
news_main1559989331.png-26182

ఫిచ్‌ రేటింగ్‌ అంచనా
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ లిక్విడిటీ సమస్య, డిఫాల్ట్‌కు దారితీయడం.. దేశ ఎన్‌బీఎఫ్‌సీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు అద్దం పడుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజన్సీ ఫిచ్‌ వ్యాఖ్యానించింది. ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు చేపట్టినా క్రెడిట్‌గ్రోత్‌ అమాంతంగా పెరిగే ఛాన్సులు కనిపించడం లేదని తేల్చిచెప్పింది. ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రమే భారీ లిక్విడిటీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, బ్యాంకులకు పెద్దగా ఈ సమస్యలేదని తెలిపింది. అయితే బ్యాంకుల్లో ఆస్తుల నాణ్యత, మూలధన బలహీనత అనే సమస్యలున్నాయని తెలిపింది. అందువల్ల ఆర్‌బీఐ రేట్లను తగ్గించినా, క్రెడిట్‌ గ్రోత్‌ మాత్రం మందకొడిగానే ఉంటుందని అంచనా వేసింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత ఎన్‌బీఎఫ్‌సీ రంగమంతా ఇబ్బందుల్లోపడింది. ఇందులో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పేరు తరుచుగా వినిపిస్తోంది. ఈ సంక్షోభంతో ఎన్‌బీఎఫ్‌సీల నుంచి మదుపరులు పెట్టుబడులు వెనక్కుతీసుకోవడంతో ఈ సంస్థలన్నీ నగదు కొరతతో బాధలు పడతున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ మార్కెట్లో సెన్సిటివిటీపై ఆధారపడి ఉంటుందని, ఎప్పుడైతే మార్కెట్‌ సెంటిమెంట్‌ నెగిటివ్‌గా మారుతుందో, వెంటనే ఈ రంగంలో నగదు కొరత తలెత్తుతుందని ఫిచ్‌ పేర్కొంది. దీర్ఘకాలిక ఆస్తుల కోసం స్వల్పకాలిక ఫండింగ్‌ ఇచ్చే ఇలాంటి సంస్థల రుణకేటాయింపు నమూనాలన్నీ లిక్విడిటీ కొరతతో దెబ్బతిన్నాయని తెలిపింది. దీంతో ఈ సంస్థలన్నీ నగదు సమీకరణకు కొత్త మార్గాలు వెతుకుతున్నాయని, ఇందులో భాగంగా యూఎస్‌డాలర్‌ బాండ్‌మార్కెట్‌పై కూడా కన్నేశాయని తెలిపింది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే సంస్థలకు క్రెడిట్‌ పాజిటివ్‌గా మారుతుందని, ఫండింగ్‌ ప్రొఫైల్స్‌ బలపడతాయని తెలిపింది. లిక్విడిటీ కొరత దేశీయ ఎకానమీలో వడ్డీవ్యయాలు పెరిగేందుకు, లోన్‌గ్రోత్‌ తగ్గేందుకు కారణమవుతోంది. You may be interested

ఇంట్రాడేలో 14నెలల గరిష్టానికి పసిడి

Saturday 8th June 2019

ప్రపంచ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం 14నెలల గరిష్టానికి తాకింది. నిన్న రాత్రి అమెరికా మే నెల ఉద్యోగ గణాంకాలను విడుదల చేసింది. ఈ నెలలో 75,000 కొత్త ఉద్యోగాల కల్పన జరిగినట్లు గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ సంఖ్య మార్కెట్‌ వర్గాల అంచనాల కంటే తక్కువ. గణాంకాలు అంచనాలను అంకోలేకపోవడంతో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోతపై అంచనాలను మరింత పెంచాయి. అలాగే పసిడి ర్యాలీపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ ఆరు

నిఫ్టీ చార్టుల్లో డోజీ సిగ్నల్‌

Saturday 8th June 2019

అనిశ్చితి కొనసాగుతుందన్న సంకేతం డైలీ చార్టుల్లో నిఫ్టీ డోజీ తరహా క్యాండిల్‌ను ఏర్పరిచింది. ఈ క్యాండిల్‌ సూచీల్లో అనిశ్చితి కొనసాగుతుందనేందుకు సంకేతంగా చెబుతారు. అయితే క్యాండిల్‌కు ఉన్న పొడవైన తోక, ఇంట్రాడేలో అమ్మకాల వెల్లువను సూచిస్తోంది. వీక్లీచార్టుల్లో సూచీ బేరిష్‌ డార్క్‌ క్లౌడ్‌ కవర్‌ను ఏర్పాటు చేసింది. స్వల్పకాలానికి నిఫ్టీ 11750- 11800 పాయింట్ల మధ్య మద్దతు పొందుతుందని, ఈ జోన్‌ను కాపాడుకోలేకపోతే 11550- 11650 వరకు పతనమవుతుందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌

Most from this category