News


రుణాలకు డిమాండ్‌ లేదు...డిపాజిట్లలో వృద్దీ లేదు!

Friday 10th May 2019
news_main1557471895.png-25654

ఆర్థిక మందగమన సంకేతాలు!
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందనడానికి బ్యాంకింగ్‌ తాజా రుణ, డిపాజిట్‌ గణాంకాలు అద్దం పడుతున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు...
- 2019 ఏప్రిల్‌ 26తో ముగిసిన పక్షం రోజులను చూస్తే (2018 ఇదే కాలంతో పోల్చి) రుణ వృద్ధి కేవలం 13 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో ఇది రూ.96.21 లక్షల కోట్లు (రూ.85.17 లక్షల కోట్ల నుంచి). 
- ఇ‍క ఇదే కాలంలో డిపాజిట్ల వృద్ధి చూస్తే, కేవలం 9.71 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యింది. విలువలో ఇది రూ.124.86 లక్షల కోట్లు (రూ.113.81 లక్షల కోట్ల నుంచి). 
- ఏప్రిల్‌ 19తో ముగిసిన త్రైమాసిక కాలంలో రుణ, డిపాజిట్‌ వృద్ధి రేట్లు వరుసగా 14.19 శాతం, 10.60 శాతంగా ఉన్నాయి. 
- 2019 మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరకాలంలో రుణ, డిపాజిట్‌ వృద్ధి రేట్లు 13.24 శాతం, 10.03 శాతంగా ఉన్నాయి. 
- వార్షికంగా చూస్తే, ఆహారేతర విభాగ రుణ వృద్ధి 8.4 శాతం నుంచి 12.3 శాతానికి పెరిగింది. 
- వ్యవసాయానికి రుణాల వృద్ధి రేటు 3.8 శాతం నుంచి 7.9 శాతానికి ఎగసింది. 
- సేవల రంగం విషయంలో రుణ వృద్ధి 13.8 శాతం నుంచి 17.8 శాతానికి చేరింది.
- పారిశ్రామిక రంగానికి రుణ వృద్ధి 0.7 శాతం నుంచి 6.9 శాతానికి ఎగసింది. 
- వ్యక్తిగత రుణాల విషయంలో రుణ వృద్ధి 17.8 శాతం నుంచి 16.4 శాతానికి తగ్గింది. 



You may be interested

గ్రామీణ బ్యాంకుల్లో మేమే నెంబర్‌వన్‌!

Friday 10th May 2019

మిగులు నిధుల పరంగా టాప్‌లో ఉన్నాం సెప్టెంబర్‌ నాటికి ఏపీకి పరిమితం సాగు, గృహ రుణాలపై ఎక్కువ ఫోకస్‌ పెన్షన్‌ కేటాయింపుల వల్ల లాభాల్లో క్షీణత ఏపీజీవీబీ చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌ హైదరాబాద్‌, సాక్షి బిజినెస్‌: దేశంలోని గ్రామీణ బ్యాంకులన్నింటిలో మిగులు నిధులు, ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ పరంగా టాప్‌లో ఉన్నామని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. బ్యాంకు వద్ద రూ.2286 కోట్ల మిగులు నిధులున్నాయని, నిర్వహణ లాభం 16 శాతం వృద్దితో రూ.

మూడేళ్లలో ఇతర విత్తనాలదే మెజారిటీ!

Friday 10th May 2019

పత్తి విత్తనాల వాటా 40 శాతానికి తగ్గుతుంది వరి, కూరగాయల సీడ్స్‌పై దృష్టి పెడుతున్నాం ఏటా 15-20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం సరైన అవకాశం వస్తేనే విలీనాలు, టేకోవర్లు కావేరీ సీడ్స్‌ సీఎండీ వి.భాస్కరరావు సాక్షి, బిజినెస్‌ ప్రతినిధి: దేశంలో పత్తి పంట సంతృప్త స్థాయికి చేరుకుంటోందని, అందుకే తాము పత్తితో పాటు ఇతర విత్తనాల ఉత్పత్తిని విస్తరించేలా ప్రణాళికలు వేసుకుంటున్నామని హైదరాబాద్‌ కేంద్రంగా కొనసాగుతున్న విత్తన తయారీ దిగ్గజం కావేరీ సీడ్‌ కంపెనీ లిమిటెడ్‌

Most from this category