STOCKS

News


2018-19లో 11 శాతం పడిపోనున్న పత్తి ఉత్పత్తి

Friday 8th March 2019
Markets_main1552025221.png-24488

- 328 లక్షల బేళ్లగానే ఉండొచ్చని అంచనా
- వర్షాభావ పరిస్థితులే కారణం
- దిగుమతులు పెరిగి ఎగుమతులు తగ్గుతాయి
- కాటన్‌ అసోసియేషన్‌ అంచనాలు

ముంబై: దేశంలో పత్తి (కాటన్‌) ఉత్పత్తి 2018-19 సీజన్‌లో 11 శాతం తగ్గిపోయి 328 లక్షల బేళ్లకు (ఒక్కో బేల్‌ 170 కిలోలు) పరిమితం కావచ్చని కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఏఐ) గురువారం అంచనా వేసింది. పత్తి సాగు చేసే కీలక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. 2017-18 సీజన్‌లో కాటన్‌ ఉత్పత్తి 265 లక్షల టన్నులుగా నమోదైనట్టు సీఏఐ ప్రెసిడెంట్‌ అతుల్‌ గణత్ర గురువారమిక్కడ ‘కాటన్‌ ఇండియా- 2019’ సదస్సు సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘‘ఈ ఏడాది 123 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగింది. గుజరాత్‌లో 28 శాతం వర్షాభావం ఉంది. అదే సమయంలో కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి ఉంది. వర్షాలు తగినంత లేకపోవడంతో మూడు, నాలుగో విడత పత్తి కోత ఉండకపోవచ్చు. సాధారణంగా పత్తి పంటలో నాలుగు, ఐదు విడతల్లో సేకరణ ఉంటుంది’’ అని అతుల్‌ గణత్ర తెలిపారు. పింక్‌బాల్‌ వార్మ్‌ (పంటను తినేసే పురుగులు) సమస్యను తొలగించేందుకు పత్తి పంటలను 2018 డిసెంబర్‌ 31 నాటికి తొలగించాలని మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు రైతులను ఆదేశించినట్టు చెప్పారు. 
పెరగనున్న దిగుమతులు
ఈ నేపథ్యంలో దిగుమతులు 70-80 శాతం మేర పెరిగి 27 లక్షల బేళ్లుగా ఈసీజన్‌లో ఉండొచ్చని అంచనా వ్యక్తం చేశారు. గతేడాది దిగుమతులు 15 లక్షల బేళ్లుగా ఉన్నట్టు చెప్పారు. పత్తి కొరత నేపథ్యంలో జూన్‌ తర్వాత రేట్లు మరింత పెరగొచ్చని గణత్ర పేర్కొన్నారు. పత్తి ధర ఒక క్యాండీ (356కిలోలు) ప్రభుత్వ మద్దతు ధర రూ.41,000 కంటే పైనే రూ.42,000 స్థాయిలో ఉంది. దిగుమతులు అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి ప్రధానంగా ఉండొచ్చన్నారు. ఇక ఎగుమతులు కూడా 27 శాతం తగ్గి 50 లక్షల బేళ్లుగా ఉండొచ్చని, గతేడాది 69 లక్షల బేళ్ల ఎగుమతులు జరిగాయని అతుల్‌ గణత్ర తెలిపారు. బంగ్లాదేశ్‌ డ్రేడ్‌ అసోసియేషన్‌, స్పిన్నర్‌ అసోసియేషన్‌తో ఒప్పందం త్వరలోనే కుదుర్చుకోనున్నామని, దీంతో ఆ దేశానికి ఎగుమతులు 30 శాతం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. చైనాకు సైతం ఎగుమతులు గతేడాది ఉన్న 8 లక్షల బేళ్లతో పోలిస్తే 15-20 లక్షల బేళ్లకు పెరగొచ్చన్నారు. 



You may be interested

ఆ సొమ్మును డిపాజిట్‌ చేయండి!

Friday 8th March 2019

ఆ సొమ్మును డిపాజిట్‌ చేయండి! మహికో కేసులో నూజివీడు సీడ్స్‌కు బోంబే హైకోర్టు ఆదేశం రూ.138 కోట్ల నగదు లేదా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఉత్తర్వులు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మహికో మోన్‌శాంటో బయోటెక్‌ (ఎంఎంబీఎల్‌) కంపెనీ టెక్నాలజీ సమర్థమైనది కాదు కనక దానికి రాయల్టీ చెల్లించాల్సిన పనిలేదంటూ నిలిపేసిన రూ.138 కోట్లను తమ వద్ద డిపాజిట్‌ చేయాలని హైదరాబాద్‌కు చెందిన విత్తన కంపెనీ నూజివీడు సీడ్స్‌ను బొంబాయి హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని

ఫోక్స్‌వ్యాగన్‌పై రూ.500 కోట్ల జరిమానా

Friday 8th March 2019

న్యూఢిల్లీ: పర్యావరణానికి హాని కలిగించినందుకు జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) రూ.500 కోట్ల జరిమానా వడ్డించింది. ఫోక్స్‌వ్యాగన్‌ కంపెనీ తన డీజిల్‌ కార్లలో చీట్‌ డివైస్‌ను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించిందని ఎన్‌జీటీ పేర్కొంది. పర్యావరణ పరీక్షలను తప్పుదోవ పట్టించే సాఫ్ట్‌వేర్‌ను ఫోక్స్‌వ్యాగన్‌ తన కార్లలో వినియోగించిందని, ఈ కార్ల అమ్మకాలను భారత్‌లో నిషేధించాలంటూ ఐలావాడి అనే స్కూల్‌ టీచర్‌, మరికొందరు ఫిర్యాదు

Most from this category