STOCKS

News


మౌలికరంగం నెమ్మది

Thursday 1st November 2018
news_main1541051974.png-21628

- సెప్టెంబర్‌లో 4.3 శాతం వృద్ధి
- నాలుగు నెలల కనిష్టం

న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక రంగం వృద్ధి సెప్టెంబర్‌లో మందగించింది. వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 4.7 శాతం. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. క్రూడ్‌ ఆయిల్‌, సహజ వాయువు ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోవడం మొత్తం గ్రూప్‌పై ప్రభావం చూపింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40.27 శాతం వాటా ఉన్న ఎనిమిది విభాగాలనూ వేర్వేరుగా చూస్తే...

వృద్ధి పెరిగినవి...మూడు
- ఎరువులు: 2.5 శాతంగా వృద్ధి నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటులో అసలు వృద్ధిలేకపోగా -7.7 శాతం క్షీణతలో ఉంది.
- సిమెంట్‌: వృద్ధి 0.1 శాతం నుంచి 11.8 శాతానికి ఎగసింది.
- విద్యుత్‌: ఈ విభాగంలో కూడా వృద్ధి 3.2 శాతం నుంచి 8.2 శాతానికి చేరింది.
వృద్ధి తగ్గినవి... మూడు
- బొగ్గు: వృద్ధి 10.4 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గింది.
- రిఫైనరీ ప్రొడక్టులు: 8.1 శాతం నుంచి 2.5 శాతానికి డౌన్‌
- స్టీల్‌: 3.7 శాతం నుంచి 3.2 శాతానికి మైనస్‌

క్షీణతలో... రెండు
- క్రూడ్‌ ఆయిల్‌: 0.1 శాతం వృద్ధి -4.2 శాతం క్షీణతలోకి జారింది.
- సహజ వాయువు: 6.3 శాతం వృద్ధి నుంచి -1.8 శాతం క్షీణతలోకి పడింది.

ఎనిమిది నెలల్లో 5.5 శాతం
కాగా ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) ఈ రంగాల వృద్ధి రేటు 5.5 శాతంగా నమోదయింది. గత ఏడాది ఇదే నెలలో ఈ రేటు 3.2 శాతం.



You may be interested

టాటామోటర్స్‌ నష్టాలు రూ.1009 కోట్లు

Thursday 1st November 2018

బలహీనంగా జేఎల్‌ఆర్‌ పనితీరు పుంజుకున్న దేశీయ వ్యాపారం 3 శాతం పెరిగి రూ.72,112 కోట్లకు ఆదాయం ముంబై: టాటా మోటార్స్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,009 కోట్ల నికర నష్టాలొచ్చాయి. కంపెనీ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) పనితీరు బలహీనంగా ఉండటంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.2,502 కోట్ల నికర లాభం వచ్చిందని టాటా

వ్యాపారానికి బెస్ట్‌... భారత్‌!

Thursday 1st November 2018

- 100వ స్థానం నుంచి 77వ స్థానానికి - ప్రపంచ బ్యాంకు ర్యాంకుల్లో మెరుగుదల - ఆరు అంశాల్లో పుంజుకున్న పనితీరు - అనుమతులు, రుణాలు పొందడం సులభం - విద్యుత్‌ కనెక్షన్‌, పన్నుల చెల్లింపూ ఈజీనే - ఇది అరుదైన ఘనత: కేంద్రం న్యూఢిల్లీ: వ్యాపారం సులభంగా నిర్వహించేందుకు వీలున్న దేశాల్లో భారత్‌ మరింత పైకి చేరుకుంది. ప్రపంచ బ్యాంకు ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకుల్లో గతేడాది 100కి చేరిన మన దేశం... తాజాగా విడుదలైన

Most from this category