STOCKS

News


బ్యాంకింగ్‌ సేవలకు కొత్త రూపం: రాజీవ్‌కుమార్‌

Monday 1st October 2018
news_main1538371759.png-20737

న్యూఢిల్లీ: రుణ వృద్ధిని పట్టాలెక్కించేందుకు ఆన్‌లైన్‌ సేవలను విస్తృతపరచాలని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. ఎంఎస్‌ఎంఈలు రూ.కోటి వరకు రుణాలను కేవలం గంట వ్యవధిలోనే పొందేందుకు తాజాగా ప్రారంభించిన పోర్టల్‌పై సేవలను విస్తరించాలన్నది యోచన. ‘‘ఎంఎస్‌ఎంఈ రుణ గ్రహీతల కోసం www.psbloansin59minutes.com వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. ఈ పోర్టల్‌పై మరిన్ని రుణ ఉత్పత్తులు... హోమ్‌లోన్‌, పర్సనల్‌ లోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాం’’ అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ తెలిపారు. కాంటాక్ట్‌లెస్‌ బ్యాంకింగ్‌ (బ్యాంకు శాఖకు వెళ్లే అవసరం లేకుండా) సేవలు నూతన నమూనాగా పేర్కొన్నారు. ఇది పారదర్శకతను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక రంగానికి వెన్నెముక అయిన ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణాలు మరింతగా అందేందుకు ఈ పోర్టల్‌ సాయపడుతుందని చెప్పారు. 



You may be interested

మాల్యా ఫోర్స్‌ ఇండియా విక్రయంలో గోల్‌మాల్‌!

Monday 1st October 2018

లండన్‌: లిక్కర్‌ వ్యాపారవేత్త విజయ్‌ మల్యా నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలను రాబట్టుకోలేక తంటాలు పడుతున్న భారతీయ బ్యాంకులకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. మాల్యాకు చెందిన ఫార్ములా వన్‌ రేసింగ్‌ టీమ్‌ ఫోర్స్‌ ఇండియా విక్రయంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రధాన బిడ్డర్లలో ఒకటైన రష్యా ఫెర్టిలైజర్‌ గ్రూప్‌ యురాల్కలి ఆరోపించింది. గతవారంలో ఈ వేలం​ ప్రక్రియ పూర్తయింది. అయితే, వేలంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని.. దీనివల్ల మాల్యాకు రుణమిచ్చిన

ఆర్‌బీఐ పాలసీ, ఎన్‌బీఎఫ్‌సీ పరిణామాలే కీలకం..!

Monday 1st October 2018

ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష, స్థూల ఆర్థిక సమాచార వెల్లడి, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) రంగంలో చోటుచేసుకోనున్న పరిణామాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు అత్యంత కీలకంగా ఉండనున్నట్లు దలాల్‌ స్ట్రీట్‌ పండితులు అంచనావేస్తున్నారు. అమెరికా–చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, పెరుగుతున్న ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం 72.48 వద్ద ముగియడం లాంటి ప్రతికూల

Most from this category