STOCKS

News


'రోబో 2.0'పై టెల్కోల అభ్యంతరం

Wednesday 28th November 2018
news_main1543391646.png-22448

న్యూఢిల్లీ: అనేక అవరోధాలను అధిగమించి రిలీజ్‌కు సిద్ధమవుతున్న రోబో సీక్వెల్ 2.0 సినిమాకు ఈసారి టెల్కోల రూపంలో సమస్యలు వచ్చిపడ్డాయి. మొబైల్ ఫోన్లు, టవర్లు ఆరోగ్యానికి చేటు చేస్తాయన్న అర్థం వచ్చేలా ఈ సినిమా ట్రైలర్లు ఉన్నాయంటూ టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమా కంటెంట్ టెల్కోల ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందంటూ ఆరోపించింది.ఈ నేపథ్యంలో సినిమాకు ఇచ్చిన సర్టిఫికేషన్‌ను ఉపసంహరించాలంటూ సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ)ని కోరాయి. మొబైల్ ఫోన్లు, టవర్ల ద్వారా వచ్చే విద్యుదయస్కాంత తరంగాలు .. ఇటు పర్యావరణానికి అటు మానవాళితో పాటు పక్షులు తదితర జీవరాశులకు హానికరమన్న భావన కలిగించేలా ఈ సినిమా ట్రయలర్స్ ఉన్నాయని సీవోఏఐ ఆరోపించింది. 
ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేకుండా మొబైల్ టవర్లు, ఫోన్లపై అవాస్తవాలను ప్రచారం చేయడం ద్వారా ఇవి ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రమాదముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సీబీఎఫ్‌సీ తమ అభ్యర్ధనపై నిర్ణయం తీసుకునే దాకా టీజరు, ట్రైలరుతో పాటు తమిళ వెర్షన్‌కి ఇచ్చిన సర్టిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించాలని కోరుతున్నట్లు సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తెలిపారు. స్టార్‌  రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఈ నెల 29న విడుదల అవుతోంది. 



You may be interested

ఆర్‌బీఐ నుంచి మరో రూ.40,000 కోట్లు

Wednesday 28th November 2018

ముంబై: వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంపు చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ వచ్చే నెలలో రూ.40,000 కోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ కింద ప్రభుత్వ సెక్యూరిటీలను డిసెంబర్‌ నెలలో కొనుగోలు చేయనున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నెలలో రూ.40,000 కోట్ల లిక్విడిటీని అందుబాటులోకి తీసుకురానున్నామని ఆర్‌బీఐ ప్రకటించగా, ఇప్పటికే రూ.30,000 కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు పూర్తి చేసింది. గురువారం మరో​ రూ.10,000 కోట్ల మేర అందుబాటులోకి

ఆయుష్మాన్‌ భారత్‌తో మూడు లక్షల మందికి ప్రయోజనం

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య స్కీమ్‌ కారణంగా నెలన్నర కాలంలో మూడు లక్షల మంది పేదలు ప్రయోజనం పొందారని ఆర్థిక మంత్రి ఆరుణ్‌ జైట్లీ చెప్పారు. వీరిలో సగం మంది హాస్పిటలైజేషన్‌ ప్రయోజనాలు పొందారని వివరించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యాపారానికి, పేదలకు అనుకూలంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు కావలసిన నిధులకు అపారమైన వనరులు అవసరమని వివరించారు. మేకింగ్‌ ఆఫ్‌ న్యూ ఇండియా, ట్రాన్స్‌ఫార్మేషన్‌ అండర్‌ మోదీ గవర్నమెంట్‌

Most from this category