News


డిపాజిట్లకోసం బ్యాంకుల మధ్య పోటీ!

Tuesday 12th March 2019
news_main1552382052.png-24557

- రుణ వృద్ధి అవకాశాల 
నేపథ్యంలో ఇండియా రేటింగ్స్‌ అంచనా
- ఇదే జరిగితే వడ్డీరేట్లు పెరిగే చాన్స్‌!

న్యూఢిల్లీ: దేశంలో రుణ వృద్ధి అవకాశాల మెరుగుపడుతున్న నేపథ్యంలో... డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకుల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ అంచనావేస్తోంది. ఇదే జరిగితే డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంపునకు ఈ పరిస్థితి దారితీస్తుందని విశ్లేషించింది. ముఖ్యంగా బల్క్‌ డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకుల మధ్య పోటీ నెలకొంటుందని రేటింగ్‌ ఏజెన్సీ తాజా నివేదిక వివరించింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే, వ్యవస్థలో రుణ వృద్ధి 12.9 శాతం అయితే, అదే సమయంలో డిపాజిట్ల వృద్ధి రేటు 9.3 శాతం. డిపాజిట్ల సమీకరణకు పోటీ పరిస్థితి నెలకొనవచ్చని ఈ అంశం సూచిస్తున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ తెలిపింది. 2018 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికాన్ని చూస్తే,  మొత్తం బ్యాంకింగ్‌ రుణవృద్ధి రేటు 8.4 శాతం అయితే, ఇదే కాలంలో డిపాజిట్‌ వృద్ధి రేటు  4.9 శాతం. అయితే ఒక్క ప్రైవేటు బ్యాంకులు రుణ వృద్ధి భారీగా 22 శాతం నమోదవుతుండడం గమనార్హం. దీనితో ప్రైవేటు రంగ బ్యాంకులు నిధుల సమీకరణలో భాగంగా డిపాజిట్‌ రేట్లను పెంచే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ పేర్కొంది.



You may be interested

మీరు చెప్పిందేమిటి...జరిగిందేమిటి..

Tuesday 12th March 2019

మీరు చెప్పిందేమిటి...జరిగిందేమిటి.. - ఆర్‌కామ్‌ అంశ౾లో బ్యాంకర్లపై ఎన్‌సీఎల్‌ఏటీ అక్షింతలు న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) కేసులో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) బ్యాంకులకు అక్షింతలు వేసింది. అసెట్స్ అమ్మకం ద్వారా రూ. 37,000 కోట్లు రాబట్టేసుకుంటామంటూ 'తప్పుడు అభిప్రాయం' కలిగించాయని, తీరా చూస్తే అమ్మకం జరగకపోగా.. రూ. 260 కోట్ల ఐటీ రీఫండ్‌ను రికవర్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నాయని వ్యాఖ్యానించింది. "రిలయన్స్ జియోకి అసెట్స్‌ను

సెంట్రల్‌బ్యాంక్‌, ఐఓబీ మూడీస్‌ రేటింగ్‌ పెంపు

Tuesday 12th March 2019

- బీఏ3 నుంచి బీఏ2కు అప్‌ - కేంద్ర తాజా మూలధన  కల్పన కారణం ముంబై: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ దీర్ఘకాలిక దేశీయ, విదేశీ కరెన్సీ డిపాజిట్స్‌ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రస్తుతం ఈ రేటింగ్‌ బీఏ3గా ఉంటే దీనిని బీఏ2కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు బ్యాంకులకు కేంద్రం తగిన తాజా మూలధనం సమకూర్చుతుండడం తమ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌కు కారణమని

Most from this category