STOCKS

News


ఎగుమతులకు తాజా ప్రోత్సాహకాలు

Saturday 27th October 2018
news_main1540610123.png-21514

న్యూఢిల్లీ: ఎగమతిదారులకు ప్రోత్సాహకాలివ్వడం ద్వారా ఎగుమతుల్ని పెంచేందుకు సమగ్ర విధానాన్ని తేవటంపై కేంద్ర వాణిజ్య శాఖ కసరత్తు చేస్తోంది. 2017-18లో ఎగుమతులు 10 శాతం పెరిగి 300 బిలియన్‌ డాలర్లుగా ఉన్న విషయాన్ని డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారీన్‌ ట్రేడ్‌ (విదేశీ వాణిజ్య విభాగం) అలోక్‌ చతుర్వేది తెలియజేశారు. సీఐఐ నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 330-340 బిలియన్‌ డాలర్ల స్థాయికి పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో  (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు) మన దేశం నుంచి ఎగుమతి అయిన ఉత్పత్తుల విలువ 12.5 శాతం పెరిగి 164 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కొన్ని రంగాలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, ఇంజనీరింగ్‌, జెమ్స్‌, జ్యుయలరీ, కెమికల్స్‌, టెక్స్‌టైల్స్‌, ఫార్మా రంగాలు ఇందులో ఉన్నట్టు చతుర్వేది చెప్పారు. ఈ రంగాలకు సంబంధించిన అంశాలను సంబంధిత విభాగాలు పరిగణనలోకి తీసుకుంటాయన్నారు. ‘‘ఓ పథకానికి తుదిరూపు ఇవ్వనున్నాం. మన ఎగుమతిదారులకు ప్రతికూలతలు ఉన్న చోట కొన్ని రకాల రాయితీలు ఇవ్వడం ఇందులో భాగం’’ అని చతుర్వేది తెలిపారు. పన్నులు, సుంకాల రాయితీలతోపాటు వెనెజులా, సుడాన్‌, క్యుబా, సీఐఎస్‌ దేశాలకు ప్రత్యామ్నాయ చెల్లింపుల విధానం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
కొత్త మార్కెట్లను చేరుకోవాలి: సురేష్‌ ప్రభు
ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా తదితర నూతన మార్కెట్లలో ఎగుమతి అవకాశాలను గుర్తించే విషయంలో... పరిశ్రమ మరింత చురుగ్గా వ్యవహరించాలని కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్‌ ప్రభు సూచించారు. సార్క్‌, ఆసియాన్‌ దేశాల్లో ఎగుమతులకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. తమ మంత్రిత్వ శాఖ రూపొందిస్తున్న కార్యాచరణను త్వరలోనే విడుదల చేస్తామని, ఇది ఎగుమతులను పెంచుంతుందన్నారు. You may be interested

‍స్పీడు పెంచిన ‘టాటా’

Saturday 27th October 2018

న్యూఢిల్లీ: రేసు కార్లపై దృష్టిసారించిన టాటా మోటార్స్‌... కోయంబత్తూర్‌ సంస్థ జయం ఆటోమోటివ్స్‌తో కలిసి దేశీ మార్కెట్‌లో రెండు సరికొత్త కార్లను శుక్రవారం విడుదలచేసింది. టియాగో జేటీపీ, టైగర్ జేటీపీ పేరిట విడుదలైన ఈ కార్లలో శక్తివంతమైన 1.2 -లీటర్ టర్బోచార్జిడ్ న్యూ జనరేషన్‌ రివోట్రన్‌ పెట్రోల్ ఇంజిన్‌లను అమర్చినట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఈ స్థాయి ఇంజిన్‌ నుంచి 112 బీహెచ్‌పీ, 150 ఎన్‌ఎం పీక్ టార్క్ విడుదలై..

కోరమాండల్‌ లాభం రూ.366 కోట్లు

Saturday 27th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో క్రితంతో పోలిస్తే నికరలాభం సుమారు 5 శాతం పెరిగి రూ.366 కోట్లకు చేరింది. టర్నోవరు 36 శాతం అధికమై రూ.5,018 కోట్లకు ఎగసింది. ‘దక్షిణాదిన రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరిగాయి. ఈశాన్య రుతుపవనాలు సాధారణంగా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఏడాది రెండో భాగం అనుకూలంగా ఉంటుంది’ అని కంపెనీ ఎండీ సమీర్‌ గోయల్‌

Most from this category