STOCKS

News


10 నుంచి క్లబ్‌ ఫ్యాక్టరీ దివాలీ సేల్‌

Saturday 6th October 2018
news_main1538802025.png-20909

హైదరాబాద్‌: ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘క్లబ్‌ ఫ్యాక్టరీ’ ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ‘క్లబ్‌ దివాలీ సేల్‌’ పేరుతో పండుగ విక్రయాలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. వినూత్నమైన వస్త్రశ్రేణి, జ్యుయలరీ, సౌందర్య ఉత్పత్తులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, గ్యాడ్జెట్లు, గృహ అలకంరణ ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలతో అమ్మకాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. రూ.99 నుంచి ధరలు ప్రారంభమవుతాయని... క్లబ్‌ ఫ్యాక్టరీ యాప్‌లో కొనుగోళ్లపై ప్రతీ రోజూ ఒక వినియోగదారునికి ఐఫోన్‌ గెలుచుకునే అవకాశం కూడా ఉంటుందని కంపెనీ ప్రకటించింది.



You may be interested

హెక్సాగాన్‌ ఇండియా విస్తరణ

Saturday 6th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ సొల్యూషన్స్‌ కంపెనీ హెక్సాగాన్‌ కెపాబిలిటీ సెంటర్‌ ఇండియాను (హెచ్‌సీసీఐ) విస్తరించింది. హైదరాబాద్‌లోని ఈ సెంటర్‌కు తాజాగా 300 సీట్ల సామర్థ్యాన్ని జోడించింది. దీంతో సిబ్బంది సంఖ్య 1,250కి చేరింది. మరో 300ల మంది ఉద్యోగులు కూర్చునేలా మరింత స్పేస్‌ను కైవసం చేసుకుంటామని హెక్సాగాన్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ప్రమోద్‌ కౌశిక్‌ తెలిపారు. కస్టమర్‌ ఈవెంట్‌ సందర్భంగా  శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పుణేలో 250 మంది నిపుణులతో

తెలుగు రాష్ట్రాల్లోకి ‘హోమ్‌’ టీవీలు

Saturday 6th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎల్‌ఈడీ టీవీల విపణిలోకి ఇటీవల ప్రవేశించిన కొత్త బ్రాండ్‌ ‘హోమ్‌’ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. కంపెనీ 12 రకాల మోడళ్లను రూ.10,990-64,990 ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. 365 రోజులపాటు రీప్లేస్‌మెంట్‌ వారంటీ ఉంది. 4కే హెచ్‌డీ స్మార్ట్‌ టీవీలు రూ.29,990 నుంచి, 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ టీవీల శ్రేణి రూ.34,990 నుంచి అందుబాటులో ఉంది. మొబైల్స్‌ రిటైల్‌ దుకాణాల్లో ఈ టీవీలు లభిస్తాయి. హ్యాండ్‌సెట్స్‌

Most from this category