News


ఐటీ మినహాయింపు పరిమితి రెట్టింపు చేయాలి

Thursday 10th January 2019
news_main1547098671.png-23499

  • రూ. 5 లక్షలకు పెంచాలి
  • సెక్షన్ 80సి డిడక్షన్ పరిమితి పెంచాలి
  • కేంద్రానికి సీఐఐ వినతి

న్యూఢిల్లీ: వచ్చే నెల 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయాలపై పన్ను మినహాయింపుల పరిమితిని పెంచాలంటూ కేంద్రాన్ని పరిశ్రమ వర్గాలు కోరాయి. ఐటీ మినహాయింపును రెట్టింపు స్థాయికి రూ.5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. అలాగే పొదుపును ప్రోత్సహించే దిశగా సెక్షన్ 80సి కింద డిడక్షన్ పరిమితిని కూడా ప్రస్తుతమున్న రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచాలని కోరాయి. ఆర్థిక శాఖకు సమర్పించిన ప్రీ-బడ్జెట్ కోర్కెల చిట్టాలో పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఈ మేరకు విజ్ఞప్తులు చేసింది. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.

కార్పొరేట్ ట్యాక్స్ 25 శాతానికి తగ్గించాలి..
ప్రస్తుతం రూ. 2.5 లక్షల దాకా వ్యక్తిగత ఆదాయంపై పన్ను మినహాయింపులు ఉంటున్నాయి. రూ. 2.5-5 లక్షల దాకా ఆదాయంపై 5 శాతం, రూ. 5-10 లక్షల దాకా 20 శాతం, రూ. 10 లక్షలు దాటితే 30 శాతం మేర పన్ను రేటు వర్తిస్తోంది. మధ్యంతర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయంపై పన్ను మినహాయింపుల పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని సీఐఐ కోరింది. ఇక రూ. 5-10 లక్షల శ్లాబ్‌లో రేటును 10 శాతానికి, రూ. 10-20 లక్షల ఆదాయంపై పన్నును 20 శాతానికి తగ్గించాలని సిఫార్సు చేసింది. రూ. 20 లక్షల పైగా ఆదాయం ఉన్న వారిపై 25 శాతం పన్ను రేటు విధించాలని కోరింది. వైద్య వ్యయాలు, రవాణా అలవెన్సులకు కూడా మినహాయింపులు ఇవ్వాలని పేర్కొంది. మరోవైపు కార్పొరేట్ ట్యాక్స్‌ను కూడా టర్నోవర్‌తో సంబంధం లేకుండా 25 శాతానికి తగ్గించాలని, ఆ తర్వాత క్రమానుగతంగా దీన్ని 18 శాతం స్థాయికి తేవాలని విజ్ఞప్తి చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద డిడక్షన్‌ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచితే పొదుపు చేసేందుకు మరింత అవకాశం కల్పించినట్లవుతుందని సీఐఐ తెలిపింది. రూ. 40,000 స్టాండర్డ్ డిడక్షన్‌ పాటు వైద్య చికిత్స వ్యయాలు, రవాణా అలవెన్సులకు మినహాయింపులు పునరుద్ధరించాలని కోరింది. స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్‌తో దీర్ఘకాలిక మూలధన నష్టాలను సెటాఫ్ చేసుకునేందుకు అనుమతించాలని పేర్కొంది.



You may be interested

భారత్‌ వృద్ధి తీరు భేష్‌

Thursday 10th January 2019

- ఆర్థిక దిగ్గజాల విశ్లేషణ - 2018-19లో వృద్ధి 7.3 శాతమని ప్రపంచబ్యాంక్‌ అంచనా - మూడవ అతిపెద్ద వినిమయ మార్కెట్‌గా అవతరిస్తుందన్న డబ్ల్యూఈఎఫ్‌ - వృద్ధికి ప్రభుత్వ చర్యలు దోహదపడతాయన్న పీడబ్ల్యూసీ- ఫిక్కీ సర్వే వాషింగ్టన్‌/ముంబై: భారత్‌ ఆర్థిక వ్యవస్థపై సానుకూల అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతంగా ఉంటుందని తన తాజా నివేదికలో ప్రపంచబ్యాంక్‌ పేర్కొంది. ఇక వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) ఒక నివేదిక విడుదల చేస్తూ,

ఎలక్ట్రిక్‌ వాహనం కొంటే... పార్కింగ్‌ ఉచితం

Thursday 10th January 2019

రోడ్‌ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా తక్కువే ప్రభుత్వానికి ప్యానెల్‌ సిఫారసులు న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి ముందుకొచ్చే వారికి ఎన్నో ప్రోత్సాహకాలు, రాయితీలు లభించనున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం నియమించిన కేబినెట్‌ సెక్రటరీ ప్రదీప్‌కుమార్‌ సిన్హా ఆధ్వర్యంలోని ప్యానెల్‌ పలు కీలక సిఫారసులు చేసింది. తయారీదారులు కూడా పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలన్నది ప్రతిపాదన. ఎలక్ట్రిక్‌ వాహనాల విడిభాగాలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని తక్కువ ఉండేలా చూడాలని,

Most from this category