STOCKS

News


అప్పుడు ఎన్ని నోట్లు ముద్రించారో చెప్పాల్సిందే

Tuesday 18th December 2018
news_main1545109400.png-23024

న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్‌ తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2,000, రూ.500 నోట్ల ముద్రణ వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడానికి ఆర్‌బీఐ అనుబంధ నోట్ల ముద్రణ విభాగం నిరాకరించింది. 2016 నవంబర్‌ 9 నుంచి అదే నెల 30వ తేదీ మధ్య ఎన్ని రూ.2,000 నోట్లు, రూ.5,00 నోట్లను ముద్రించారో సమాచారమివ్వాలని కోరుతూ హరీందర్‌ దింగ్రా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. సరైన స్పందన రాకపోవడంతో ఆయన సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌కు (సీఐసీ) అప్పీలు చేసుకున్నాడు. ఆర్‌బీఐకి చెందిన ‘భారతీయ రిజర్వ్‌ బ్యాంకు నోట్‌ ముద్రణ్‌ లిమిటెడ్‌’ సీఐసీకి తన వాదనలు వినిపిస్తూ... కరెన్సీ నోట్ల ముద్రణ, సంబంధిత వివరాలను ప్రజలతో పంచుకోరాదని, ఇది నకిలీ కరెన్సీ వ్యాప్తి, ఆర్థిక గందరగోళానికి దారితీస్తుందని చెప్పింది. ఇది పూర్తిగా గోప్యంగా ఉంచాల్సిన సమాచారంగా పేర్కొంది. ఈ సమాచారాన్ని వెల్లడిస్తే అది దేశ సమగ్రతకు, సౌర్వభౌమత్వం, భద్రత, ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్‌ 8(1)(ఎ) కింద ఈ సమాచారానికి మినహాయింపు ఉందని తెలియజేసింది. అయితే ఈ వాదనలను సీఐసీ భార్గవ తోసిపుచ్చారు. రోజువారీగా ఎన్ని నోట్లను ముద్రించారన్న సమాచారం అంత సున్నితమైనదేమీ కాదని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని వెల్లడించాలని ఆదేశించారు.



You may be interested

ఎల్‌ఐసీ-ఐడీబీఐ డీల్‌పై పిటిషన్‌ తిరస్కృతి

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: ఐడీబీఐలో (ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీ (లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) చేస్తున్న ప్రయత్నాల్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఆల్‌ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్‌ విభూ భక్రూ తిరస్కరించారు. షేర్‌హోల్డింగ్‌లో మార్పు వల్ల ఐడీబీఐకు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌ హోదా పోతుందని బ్యాంక్‌ ఆఫీసర్స్‌

'కోటక్ బ్యాంక్‌'కు కోర్టులో చుక్కెదురు

Tuesday 18th December 2018

ముంబై: ప్రమోటర్ల వాటా తగ్గింపునకు సంబంధించిన గడువు వివాదంలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌ (కేఎంబీ)కి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన డిసెంబర్ 31 డెడ్‌లైన్‌పై స్టే విధించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కేఎంబీ దాఖలు చేసిన పిటీషన్‌పై వచ్చే ఏడాది జనవరి 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆర్‌బీఐని ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ప్రమోటర్ల వాటాను పెయిడప్‌ వోటింగ్ ఈక్విటీ క్యాపిటల్‌లో 20 శాతానికి, 2020

Most from this category