STOCKS

News


అంచనాలను మించిన చైనా వాణిజ్య గణాంకాలు

Thursday 8th November 2018
news_main1541656396.png-21786

రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా పేరున్న చైనాలో అక్టోబర్‌ నెల ఎగుమతి, దిగుమతి గణాంకాలు ఆర్థికవేత్తల అంచనాలకు మించి నమోదయ్యాయి. అంతకముందు ఏడాదితో పోలిస్తే ఎగుమతులు 15.6 శాతం, దిగుమతులు 21.4శాతం వృద్ధిని సాధించినట్లు చైనా కస్టమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. విశ్లేషకులు అక్టోబర్‌లో ఎగుమతులు 11శాతం, దిగుమతులు 14శాతం వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా వేశారు. అయితే ఇదే అక్టోబర్‌లో వాణిజ్య మిగులు మాత్రం ఆర్థికవేత్తల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ అక్టోబర్‌లో 35 బిలియన్‌ డాలర్ల వాణిజ్య మిగులును ఆర్థిక వేత్తలు అంచనావేయగా, 34.01 బిలియన్‌ డాలర్లకు మాత్రమే పరిమితమైంది. చైనా ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు అమెరికాతో నెలకొన్న వాణిజ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం ఎగుమతుల్లో వృద్ధిని సాధించినట్లు చైనా కస్టమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.  చైనాకు అతిపెద్ద మార్కెట్ గా ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టడంతో పాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఊపందుకోవడం కూడా ఎగుమతులు పెరగాడానికి కారణమైనట్లు మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా చైనా దేశంపై టారీఫ్‌లు విధించిన నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ యువాన్‌ క్షీణత దిగుతులపై ప్రభావాన్ని చూపినట్లు విశ్లేషకులంటున్నారు.



You may be interested

హిస్టరీ రిపీట్‌ అయితే ర్యాలీ!!

Thursday 8th November 2018

గత రెండు నెలలుగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బేర్‌ గుప్పిట్లో ఉంది. నిఫ్టీ తన గరిష్ట స్థాయి నుంచి 14 శాతానికిపైగా పతనమైంది. రూపాయి క్షీణత, క్రూడ్‌ ధరల పెరుగుదల, వాణిజ్య లోటు విస్తరణ, లిక్విడిటీ భయాలు వంటి అంశాలు మార్కెట్‌లో ఒడిదుడుకులకు కారణమయ్యాయి. అయితే దీర్ఘకాల ఇన్వెస్టర్లు మార్కెట్‌పై ఇంకా నమ్మకాన్ని కోల్పోలేదు. గత 12 ఏళ్లలో చూస్తే.. ఇండెక్స్‌ దాదాపు 14 శాతం మేర పతనమైన ప్రతీసారి..

డైవర్సిఫై చేయడమే... సరైన నిర్ణయం..!

Thursday 8th November 2018

మోబియస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపకుడు, సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ మార్క్‌ మోబియస్‌ సూచన స్టాక్‌ మార్కెట్‌ 20 ఏళ్ల చరిత్రను గమనించినట్లయితే, ఇందులో ఉత్తమ ర్యాలీ కనబర్చిన కాలం కేవలం 2 ఏళ్లు మాత్రమే ఉంటుందని ఇన్వెస్ట్‌మెంట్‌ గురు, మోబియస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపకుడైన మార్క్‌ మోబియస్‌ వ్యాఖ్యానించారు. ఏ దేశ మార్కెట్‌ను పరిశీలించినా ఇదే విధంగా ఉంటుందని వెల్లడించిన ఆయన.. ఇటువంటి ప్రయాణం చేస్తున్న మార్కెట్లకు సరైన విధానం డైవర్సిఫై

Most from this category