రికార్డు స్థాయికి చైనా నవంబర్ వాణిజ్య మిగులు
By Sakshi

చైనా వాణిజ్య మిగులు గతేడాదితో పోలిస్తే ఈ నవంబర్‌లో రికార్డు స్థాయిలో వాణిజ్య మిగులును సాధించింది. నవంబర్‌లో ఆ దేశ వాణిజ్య మిగులు 44.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాది ఇదే నవంబర్‌లో సాధించిన 35 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులుతో పోలిస్తే ఇది 21శాతం అధికం. ట్రేడ్ వార్‌లో భాగంగా అమెరికా దిగుమతులపై నిషేదాన్ని విధించడంతో వాణిజ్య మిగులు రికార్డు స్థాయిని చేరినట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎగుమతులు, దిగుమతుల గణాంకాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ నవంబర్‌లో ఎగుమతులు 9.4శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషకులు అంచనా వేయగా, కేవలం 5.4 శాతం మాత్రమే వృద్ధిని కనబరిచింది. దిగుమతులు సైతం 3శాతంగానూ నమోదైనట్లు చైనా కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం, అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు, జూలై- సెప్టెంబర్ కాలంలో చైనా ఆర్థికవ్యవస్థ గడ్డుకాలాన్ని ఎదుర్కోవడం గణాంకాలను ప్రభావితం చేసినట్లు కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ పేర్కోంది.
You may be interested
జెన్సర్ టెక్నాలజీస్‌పై పాజిటివ్
Saturday 8th December 2018ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీస్ తాజాగా జెన్సర్ టెక్నాలజీస్ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్: కోటక్ సెక్యూరిటీస్ స్టాక్: జెన్సర్ టెక్నాలజీస్ రేటింగ్: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.230 టార్గెట్ ప్రైస్: రూ.257 కోటక్ సెక్యూరిటీస్.. జెన్సర్ టెక్నాలజీస్‌పై సానుకూలముగా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్ ప్రైస్‌ను రూ.257గా నిర్ణయించింది. కంపెనీ తన ఆర్వోడీ నెక్ట్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్ విభాగంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని, ఈ
10000- 13000 పాయింట్ల రేంజ్లో నిఫ్టీ!
Saturday 8th December 2018వచ్చే ఏడాదిపై కోటక్ సెక్యూరిటీస్ అంచనా వచ్చే ఏడాది చివరి వరకు నిఫ్టీ పదివేలు- పదమూడు వేల పాయింట్ల శ్రేణిలోనే కదలాడవచ్చని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. ఎన్నికల ఫలితాలను బట్టి ఈ కదలికలుంటాయని తెలిపింది. అప్‌సైడ్ టార్గెట్ అందుకోవాలంటే, ఎర్నింగ్స్ జోరు ఇలాగే కొనసాగాలని, ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని తెలిపింది. వచ్చే రెండేళ్లకు కార్పొరేట్ ఎర్నింగ్స్‌లో 16 శాతం సరాసరి చక్రీయ వార్షిక వృద్ధి ఉంటుందన్న అంచనా వేసుకుంటే