News


చరణ్‌సింగ్‌ ఓకే అంటే ఆనాడే ఆదాయపన్ను శాఖ కంప్యూటరీకరణ

Monday 10th December 2018
news_main1544417237.png-22788

న్యూఢిల్లీ: భారత్‌ ఓ బంగారం వంటి అవకాశాన్ని జారవిడుచుకుందని, 1970ల చివర్లో పూర్తిగా కంప్యూటర్‌ ఆధారిత పన్ను వ్యవస్థ రూపకల్పన ప్రతిపాదనను టీసీఎస్‌ తీసుకురాగా, నాటి ఆర్థిక మంత్రి చరణ్‌సింగ్‌ తిరస్కరించినట్టు మేనేజ్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ శశాంక్‌ షా తన పుస్తకంలో పేర్కొన్నారు. ‘ది టాటా గ్రూపు: ఫ్రమ్‌ టార్చ్‌ బేరర్స్‌ టు ట్రయల్‌బ్లేజర్స్‌’ పేరుతో షా రాసిన పుస్తకంలో ఈ వివరాలు పేర్కొన్నారు. ‘‘1969లో ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ అనంతరం బ్యాంకుల్లో వ్యాపారం తగ్గగా, భారత్‌లో కంప్యూటర్లు వద్దని నాటి ప్రభుత్వం భావించింది. కంప్యూటరైజేషన్‌తో పెద్ద ఎత్తున ఉపాధి దెబ్బతింటుందని భావించడం జరిగింది’’ అని షా తెలిపారు. ఇప్పుడు విస్తృతంగా వినియోగిస్తున్న పాన్‌ వ్యవస్థను టీసీఎస్‌ 1977లో ఆదాయపన్ను శాఖ కోసం అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ‘‘దీని మంచి ఫలితం రావడంతో ఆదాయపన్ను శాఖ కంప్యూటీకరణ అవకాశం కూడా టీసీఎస్‌కు లభించింది. అయితే, అప్పటి ఆర్థిక మంత్రి చరణ్‌సింగ్‌ ఆర్థిక శాఖలో కంప్యూటీకరణ అవసరం లేదని, ఇది ఉపాధిలేమికి దారితీస్తుందంటూ తిరస్కరించారు. ఒకవేళ నాడు అమలు చేసి ఉంటే, పూర్తి కంప్యూటర్‌ ఆధారిత పన్ను వ్యవస్థతో ఎన్నో దేశాల కంటే భారత్‌ ముందుండేది’’ అని షా అభిప్రాయం వ్యక్తం చేశారు. 



You may be interested

మార్కెట్లకు ఎన్నికల ఫలితాల దిశానిర్దేశం

Monday 10th December 2018

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, క్రూడాయిల్ రేట్లతో పాటు అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. రాజకీయ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలు వెల్లడైన నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, స్టాక్ ఎక్స్చేంజీలు నిఘా చర్యలను మరింత పటిష్టంగా

ముంబై విమానాశ్రయం మరో నూతన రికార్డు

Monday 10th December 2018

ముంబై: ముంబైలోని జీవీకే గ్రూపు నిర్వహణలో ఉన్న ఛత్రపతి శివాజి మహారాజ్‌ ఇంటర్నేషనల్‌ విమానాశ్రయం మరో నూతన రికార్డును నమోదు చేసింది. శనివారం ఒక్క రోజే ఈ విమానాశ్రయం నుంచి 1,007 విమానాలు రాకపోకలు (వచ్చినవి, వెళ్లినవి) సాగించాయి. దీంతో 24 గంటల్లో 1,003 విమానాల రాకపోకలతో ఈ ఏడాది జూన్‌ 6న నమోదైన రికార్డును తానే తిరగరాసింది. ముకేశ్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహ ముందస్తు సంబరాలు

Most from this category