దిగజారిన సీఎఫ్‌వోల ఆశావాదం
By Sakshi

ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఎదుర్కొంటున్న నిధుల లభ్యత సమస్య, వడ్డీ రేట్ల పెరుగుదల వంటి అంశాల కారణంగా దేశంలో కంపెనీల చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల (సీఎఫ్‌వో) ఆశావాదం 19 త్రైమాసికాల కనిష్ట స్థాయికి దిగజారింది. దేశంలో అన్ని రంగాలకు చెందిన 300 మంది సీఎఫ్‌వోల నుంచి వారి కంపెనీల ఆరోగ్య స్థితి, వ్యాపార రిస్క్ పరిస్థితులు, స్థూల ఆర్థిక పరిస్థితులపై అభిప్రాయాలను డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ సంస్థ సర్వేలో భాగంగా తెలుసుకుంది. సీఎఫ్‌వోల ఆశావాద సూచీ సెప్టెంబర్ త్రైమాసికంలో 17 శాతం తగ్గి 90.2కు చేరింది. నిధుల లభ్యత తగ్గొచ్చని లేదా ప్రస్తుత స్థాయిలోనే ఉండొచ్చన్న అభిప్రాయాన్ని 72 శాతం మంది సీఎఫ్‌వోలు తెలియజేశారు.
You may be interested
32 శాతం తగ్గిన ఎన్ఎండీసీ లాభం
Wednesday 14th November 2018హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ సెప్టెంబరు త్రైమాసికంలో నిరాశ పరిచింది. స్టాండలోన్ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 32.7 శాతం తగ్గి రూ.636 కోట్లుగా నమోదయింది. టర్నోవరు రూ.2,531 కోట్ల నుంచి రూ.2,569 కోట్లకు ఎగసింది. ఏప్రిల్-సెప్టెంబరు పీరియడ్‌లో రూ.5,116 కోట్ల టర్నోవరుపై రూ.1,612 కోట్ల నికరలాభం సాధించింది. మంగళవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర క్రితంతో పోలిస్తే 0.47 శాతం
మూడు రెట్లు పెరిగిన టాటా స్టీల్ లాభం
Wednesday 14th November 2018న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టాటా స్టీల్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో మూడు రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.1,018 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.3,116 కోట్లకు పెరిగిందని టాటా స్టీల్ తెలిపింది. ఇక ఆదాయం రూ.32,676 కోట్ల నుంచి రూ.43,899 కోట్లకు ఎగసిందని టాటా స్టీల్ సీఈఓ, ఎమ్డీ టీవీ నరేంద్రన్ తెలిపారు. గత క్యూ2లో రూ.4,720