STOCKS

News


ఆహార శుద్ధి రంగంలోకి మరిన్ని ఎఫ్‌డీఐలు!

Friday 28th September 2018
news_main1538109565.png-20664

ముంబై: ఆహార శుద్ధి రంగానికి ఊతమిచ్చేందుకు గాను మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఈ రంగానికి సంబంధించి ఎఫ్‌డీఐ నియంత్రణలను సరళీకరించనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ రాజీవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఫిక్కీ నిర్వహిస్తున్న మూడు రోజుల ‘వరల్డ్‌ ఆఫ్‌ ఫుడ్‌ ఇండియా’ సదస్సు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పటికే 8.7 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు ఆహార శుద్ధి రంగంలోకి వచ్చాయి. భారీ ఎత్తున ఎఫ్‌డీఐలను ఆకర్షించే సామర్థ్యం ఈ రంగానికి ఉంది. ఈ రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు ఎఫ్‌డీఐ నియంత్రణలను ప్రభుత్వం సరళీకరిస్తుంది’’ అని రాజీవ్‌ అగర్వాల్‌ తెలిపారు. బహుళజాతి కంపెనీలు, పెట్టుబడిదారులు కొన్ని అవరోధాలను ఎదుర్కొంటున్నారని, వీటిని ఇప్పుడు తొలగించడం జరిగిందన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమలో తయారీ యూనిట్‌ ఏర్పాటుకు నూరు శాతం ఎఫ్‌డీఐలకు ప్రస్తుతం అనుమతి ఉందని, హోల్‌సేల్‌గా వ్యాపారం చేసేందుకు ఎటువంటి అనుమతి అవసరం లేదని అగర్వాల్‌ చెప్పారు. సరఫరా వ్యవస్థలో టెక్నాలజీ, పెట్టుబడులు అవసరమన్నారు. ‘‘సాగు నుంచి వినియోగం వరకు చూస్తే చాలా వరకు వృధా అవుతోంది. మనం కేవలం 7 శాతమే పాడైపోయే అవకాశం ఉన్న ఆహార ఉత్పత్తులను ‍ప్రాసెస్‌ చేయగలుగుతున్నాం. అదే అమెరికాలో ఇది 65 శాతం, చైనాలో 23 శాతం, ఫిలిప్పీన్స్‌లో 78 శాతంగా ఉంది’’ అని అగర్వాల్‌ వివరించారు. 



You may be interested

మొండి బకాయిల విషయమై ఎలాంటి అవకతవకలు లేవు

Friday 28th September 2018

ముంబై: మొండి బకాయిల విషయమై ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని యస్‌బ్యాంక్‌ స్పష్టం చేసింది. మొండి బకాయిలను కప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా చేశారా అని ఇటీవలనే నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) యస్‌బ్యాంక్‌ని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా యస్‌బ్యాంక్‌ ఈ వివరణ ఇచ్చింది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి తమ స్థూల మొండి బకాయిలు 1.3 శాతంగా, నికర మొండి బకాయిలు 0.59 శాతంగా ఉన్నాయని పేర్కొంది. భారత బ్యాంకింగ్‌ చరిత్రలోనే

భారత్‌ టాప్‌ 10 లక్ష్యం దిశగా లంబోర్గిని..!

Friday 28th September 2018

పూణే: ఇటలీకి చెందిన లగ్జరీ కార్‌ మేకర్‌ లంబోర్గిని భారత మార్కెట్‌పై దృష్టిసారించింది. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా ఇక్కడ సూపర్‌ స్పోర్ట్స్‌ కార్ల మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోందని వెల్లడించిన ఈ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సంస్థ.. విక్రయాల పరంగా అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్‌ టాప్‌ 10 దేశాల జాబితాలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. ఇటీవలే విడుదలైన ‘యూరస్‌’ సూపర్‌ ఎస్‌యూవీ డెలివరీలు కొనసాగుతున్నాయని, సగటు వెయిటింగ్‌ పిరియడ్‌ 6-9

Most from this category