STOCKS

News


సిమెంట్‌ మీద జీఎస్‌టీని తగ్గించాలి

Friday 21st December 2018
news_main1545370106.png-23134

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశ ఆర్ధికాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో సిమెంట్‌ పరిశ్రమ ప్రధాన భాగస్వామి అని ఫస్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌సీసీ) తెలియజేసింది. ప్రస్తుతం సిమెంట్‌పై ఉన్న 28 శాతం జీఎస్‌టీని వెంటనే 18 శాతానికి తగ్గించాలనే అభ్యర్థనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని.. త్వరలోనే అధికారికంగా నిర్ణయం వెలువడుతుందని ఎఫ్‌సీసీ ఫౌండర్‌ అండ్‌ ప్రెసిడెంట్‌ ప్రతాప్‌ పడోడే తెలిపారు. గురువారమిక్కడ ప్రారంభమైన రెండు రోజుల 10వ సిమెంట్‌ ఎక్స్‌పో సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జీఎస్‌టీ తగ్గింపుతో అందుబాటు గృహాలు, రహదారులు, విద్యుత్‌ వంటి మౌలిక రంగాల్లో సిమెంట్‌ వినియోగం పెరుగుతుందని చెప్పారు. దేశ వృద్ధి కంటే సిమెంట్‌ పరిశ్రమ వృద్ధి జోరుగా ఉందన్నారు. ప్రపంచ సిమెంట్‌ ఉత్పత్తిలో మన దేశానిది రెండో స్థానంలో ఉందని, థర్మల్‌ ప్రాసెస్‌ సామర్థ్యాల పరంగా సిమెంట్‌ ఉత్పత్తిని చేయడంలో మన దేశానిది స్థానం ఉందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో దేశంలో రహదారులు, పట్టణాభివృద్ధి, విద్యుత్‌ వంటి మౌలిక రంగాల్లో 454 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనుంది.
తెలుగు రాష్ట్రాల్లో అదనంగా 10–15 మిలియన్‌ టన్నులు..
వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 10–15 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ సామర్థ్యం జత అవుతుందని ప్రతాప్‌ తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 50–60 సిమెంట్‌ కంపెనీలున్నాయని.. 75 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ముడి పదార్థాల ధర, విద్యుత్, రవాణా చార్జీలు మీద ఆధారపడి సిమెంట్‌ బ్యాగ్‌ ధర ఉంటుందన్నారు. రెండు రోజుల సిమెంట్‌ ఎక్స్‌పో ప్రదర్శనకు భారతీ సిమెంట్‌ సిల్వర్‌ పార్టనర్‌గా వ్యవహరించింది. ఈ ఎక్స్‌పోలో ఏబీబీ, ఏసీసీ, అంబుజా వంటి 80కి పైగా సిమెంట్‌ కంపెనీలు, 1,200 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సిమెంట్, కన్‌స్ట్రక్షన్, ఎక్విప్‌మెంట్, టెక్నాలజీ కంపెనీలు పాల్గొన్నాయి. ప్రతి రెండేళ్లకొకసారి ప్రాంతీయ మార్కెట్లలో సిమెంట్‌ ఎక్స్‌పో ప్రదర్శను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
 



You may be interested

సెన్సెక్స్‌ 400 పాయింట్లు క్రాష్‌

Friday 21st December 2018

నిఫ్టీ 130 పాయింట్లు డౌన్‌ 10,850 దిగువకు ఇండెక్స్ శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమైన ఇండియన్‌ మార్కెట్‌ తర్వాత వేగంగా పతనమైంది. ఒకానొక సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా పడిపోతే, నిఫ్టీ 130 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 11:16 సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సెన్సెక్స్‌ 376 పాయింట్ల నష్టంతో 36,055 వద్ద, నిఫ్టీ 128 పాయింట్ల నష్టంతో 10,823 వద్ద ట్రేడవుతున్నాయి. ఫెడ్‌ రేటు పెంపు వల్ల గురువారం

విద్యా, వెల్త్‌ మేనేజ్‌మెం‍ట్‌ వ్యాపారాల్లో వాటా విక్రయం

Friday 21st December 2018

 ముంబై:  విద్యా, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపార విభాగాల్లో వాటా విక్రయ ప్రక్రియను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌​ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) గ్రూప్‌ ప్రారంభించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఐఈటీఎస్‌), ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌లో (ఐఐఎమ్‌ఎల్‌) వాటాను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ విక్రయించనుంది. ఐఈటీఎస్‌ సంస్థ కేజీ నుంచి 12వ తరగతి విద్యార్థులకు కావలసిన కంటెంట్‌ను, ఉద్యోగ సంబంధిత నైపుణ్య ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. ఇక ఐఐఎమ్‌ఎల్‌ సంస్థ ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్స్‌,

Most from this category