News


20 నుంచి సిమెంట్‌ ఎక్స్‌పో

Tuesday 18th December 2018
news_main1545110524.png-23037

హైదరాబాద్‌: ఈనెల 20–21 తేదీల్లో 10వ ఇండియన్‌ సిమెంట్‌ ఎక్స్‌పో–2018 జరగనుంది. మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఈ ప్రదర్శనకు భారతి సిమెంట్స్‌ సిల్వర్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తుంది. ఈ ప్రదర్శనలో సిమెంట్, కాంక్రీట్, ఎక్విప్‌మెంట్, నిర్మాణ, మౌలిక రంగ టెక్నాలజీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొంటారు. 80కి పైగా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఎక్స్‌పోతో పాటుగా ఈ కార్యక్రమంలో 3వ సెమెంట్‌ రివ్యూ అవార్డులు–2018, 5వ సిమెంట్‌ రివ్యూ కాన్ఫరెన్స్‌లు కూడా జరుగుతాయని నిర్వాహకులు ఒక ఒక ప్రకటనలో తెలిపారు.
 



You may be interested

10,600 స్టాప్‌లాస్‌!

Tuesday 18th December 2018

నిఫ్టీ లాంగ్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సూచన కేవలం ఐదు సెషన్లలో నిఫ్టీ 550 పాయింట్ల ర్యాలీ జరిపి సోమవారం 10900 పాయింట్లకు చేరువలో క్లోజయింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం కాస్త వెనకడుగు వేసి 10830 పాయింట్ల వద్ద కదలాడుతోంది. తాజా ర్యాలీలో నిఫ్టీ తన అధోముఖ వాలు రేఖను అవలీలగా దాటేసింది. దీంతో పాటు 200 రోజుల డీఎంఏ స్థాయి 10757ను కూడా అధిగమించింది. ప్రస్తుతం నిఫ్టీ తన 20,

అమ్మకానికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రోడ్డు ఆస్తులు !

Tuesday 18th December 2018

ముంబై: భారీ రుణ భారంతో కుదేలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ భారత్‌లోని రహదారుల ఆస్తులన్నింటినీ విక్రయానికి పెట్టింది. రహదారుల రంగానికి సంబంధించిన కంపెనీల్లో ఈక్విటీ వాటాను విక్రయించనున్నామని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా విస్తరించిన 1,774 కి.మీల మేర ఉన్న ఏడు ఆపరేషనల్‌ యాన్యుటీ ఆధారిత ప్రాజెక్ట్‌లను, 6,572 కిమీ. మేర విస్తరించిన ఎనిమిది టోల్‌ ఆధారిత ప్రాజెక్ట్‌ల్లో వాటాను విక్రయించనున్నామని పేర్కొంది. అంతేకాకుండా 1,736  కిమీ. మేర విస్తరించిన నిర్మాణంలోని నాలుగు

Most from this category