STOCKS

News


రైతు మార్కెట్లలో కోల్డ్‌ స్టోరేజీలు

Tuesday 9th October 2018
news_main1539058891.png-20948

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: కూరగాయలు, పండ్ల హోల్‌సేల్‌ మార్కెట్లలో చిన్నపాటి శీతల గిడ్డంగుల ఏర్పాటుకు తాము సిద్ధమని చాంబర్‌ ఆఫ్‌ కోల్డ్‌ స్టోరేజెస్‌ ఇండస్ట్రీ వెల్లడించింది. ప్రభుత్వం స్థలం సమకూరిస్తే కోల్డ్‌ స్టోరేజీలను తాము సొంత ఖర్చుతో నిర్మిస్తామని చాంబర్‌ తెలంగాణ ప్రెసిడెంట్‌ గుబ్బ నాగేందర్‌ రావు చెప్పారు. ఇక్కడి హైటెక్స్‌లో నవంబరు 16-17 తేదీల్లో జరుగనున్న ఇండియా కోల్డ్‌ చైన్‌ ఎక్స్‌పో, ట్రేడ్‌ షో (ఐసీఈ) వివరాలను సోమవారం మీడియాకు ఆయన వెల్లడించారు. ‘రైతు తీసుకొచ్చిన పంటను ఈ గిడ్డంగుల్లో నిల్వ చేయవచ్చు. మార్కెట్లో మంచి ధర ఉన్నప్పడే విక్రయించుకోవచ్చు. రైతులకు అతి తక్కువ ధరకే కోల్డ్‌ స్టోరేజ్‌ సేవలు అందుబాటులో ఉంటాయి’ అని వివరించారు. ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తే పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందన్నారు.
కొత్త గిడ్డంగులొస్తున్నాయ్‌..
దేశవ్యాప్తంగా సుమారు 6,000 కోల్డ్‌ స్టోరేజ్‌లు ఉన్నాయి. వీటిలో 90 శాతం యూపీ, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌లో ఉన్నాయి. తెలంగాణలో 150, ఆంధ్రప్రదేశ్‌లో 200 దాకా ఉన్నాయి. కొత్త గిడ్డంగికి రూ.1.5 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. 180 ప్రాజెక్టులు 2018-19లో సబ్సిడీ అందుకోనున్నాయని గ్లోబల్‌ కోల్డ్‌ చైన్‌ అలయన్స్‌ భారత ప్రతినిధి అతుల్‌ ఖన్నా వెల్లడించారు. వ్యవస్థీకృత రిటైల్‌, ఈ-కామర్స్‌ రంగాలు కోల్డ్‌ స్టోరేజ్‌ పరిశ్రమను నడిపిస్తున్నాయని తెలిపారు. మల్టీ కమాడిటీ స్టోరేజ్‌ సెంటర్లకు డిమాండ్‌ ఉంటోందని అలయాన్స్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ పూర్ణిమా రావత్‌ చెప్పారు. 

 



You may be interested

ఎంఎఫ్ నిర్వహణ ఆస్తుల్లో 12.5% క్షీణత

Tuesday 9th October 2018

న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) విలువ గత నెలలో తగ్గుదలను నమోదుచేసింది. ఈ ఏడాది సెప్టెంబరులో దేశీ 41 ఎంఎఫ్‌ల ఏయూఎం 12.5 శాతం క్షీణించి రూ.22 లక్షల కోట్లకు తగ్గినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) నివేదిక ద్వారా వెల్లడైంది. ఆగస్టు చివరినాటికి ఈ మొత్తం రూ.25.20 లక్షల కోట్లకు చేరుకుని రికార్డును నెలకొల్పగా... ఆ

గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ విస్తరణ

Tuesday 9th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: శీతల గిడ్డంగుల నిర్మాణం, నిర్వహణలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ భారీగా విస్తరిస్తోంది. పౌల్ట్రీ కోసం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో రెండు గిడ్డంగులను ఏర్పాటు చేయనుంది. ప్రముఖ పౌల్ట్రీ కంపెనీకోసం వీటిని నిర్మించనున్నట్టు గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌ ఎండీ గుబ్బ నాగేందర్‌ రావు సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఒక్కొక్కటి రూ.9 కోట్ల వ్యయంతో 2 కోట్ల కోడిగుడ్లను నిల్వ చేసే సామర్థ్యంతో ఇవి

Most from this category