STOCKS

News


వృద్ధికి దోహదపడే బడ్జెట్‌ : మూడీస్‌

Wednesday 6th February 2019
news_main1549429933.png-24041

న్యూఢిల్లీ: రైతులకు ప్రత్యక్షంగా నగదు బదిలీ, మధ్య తరగతికి ఊరటనిచ్చేలా పన్ను ప్రయోజన నిర్ణయాలు దేశాభివృద్ధికి దోహదపడే అంశాలని రేటింగ్‌ దిగ్గజం- మూడీస్‌ అభిప్రాయపడింది. ఆయా చర్యలు వ్యవస్థలో ద్రవ్య లభ్యతను పెంచుతాయని, వినియోగం పెరుగుతుందని, ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలో ఉద్దీపణగా పనిచేస్తాయని మూడీస్‌ వివరించింది. ఈ చర్యలు స్థూల దేశీయోత్పిత్తి (జీడీపీ) వృద్ధి రేటును 0.45 శాతం మేర పెంచుతాయని కూడా మూడీస్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే ద్రవ్యలోటు వరుసగా రెండేళ్లు కట్టుతప్పడం భారత్‌కు ‘క్రెడిట్‌ నెగిటివ్‌’ అని కూడా మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ తన విశ్లేషణలో పేర్కొనడం విశేషం. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా ప్రభుత్వానికి ద్రవ్యలోటు విషయంలో సవాళ్లు తప్పకపోవచ్చని మూడీస్‌ విశ్లేషించింది. ఇది మధ్యకాలికంగా చూస్తే, ద్రవ్య స్థిరత్వానికి సానుకూల సంకేతం కాదని వివరించింది. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)లో ఇటీవలి సర్దుబాట్లు పన్ను వసూళ్లకు సవాలేనని, ట్యాక్స్‌ బేస్‌ మరింత తగ్గవచ్చని అంచనావేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తగిన మూలధన మద్దతు లేకపోయినా, అది క్రెడిట్‌ నెగిటివ్‌కు దారితీస్తుందని హెచ్చరించింది. మౌలిక రంగంపై ప్రభుత్వ వ్యయాలు క్రెడిట్‌ పాజిటివ్‌ అని పేర్కొంది.



You may be interested

పీఎన్‌బీ.. మళ్లీ లాభాల్లోకి..!

Wednesday 6th February 2019

- క్యూ3లో రూ. 247 కోట్లు - 7 శాతం వృద్ధి - మొండిబాకీలకు తగ్గిన కేటాయింపులు న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం దెబ్బతో వరుసగా మూడు త్రైమాసికాల పాటు భారీ నష్టాలు ప్రకటిస్తూ వచ్చిన ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మొత్తానికి మళ్లీ లాభాల బాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 247 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో

ఎల్‌పీజీ వినియోగంలో మనం ప్రపంచ నెంబర్‌2

Wednesday 6th February 2019

ఎల్‌పీజీ వినియోగంలో మనం ప్రపంచ నంబర్‌2 వినియోగం 22.5 మిలియన్‌ టన్నులు 8.4 శాతం చొప్పున వృద్ధి న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎల్‌పీజీని (లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌) అత్యధికంగా వినియోగించే రెండో దేశంగా భారత్‌ పైకి చేరింది. దేశంలో ఎల్‌పీజీ డిమాండ్‌ 2025 నాటికి 34 శాతం పెరుగుతుందని పెట్రోలియం శాఖ కార్యదర్శి ఎంఎం కుట్టీ తెలిపారు. ఆసియా ఎల్‌పీజీ సదస్సు మంగళవారం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కుట్టీ మాట్లాడుతూ... ఎల్‌పీజీ

Most from this category