STOCKS

News


మధ్యంతర బడ్జెట్‌ మార్కెట్‌ను మురిపిస్తుందా?

Monday 14th January 2019
news_main1547461397.png-23580

కేంద్రంలో కొలువుతీరిన బీజేపీ సారధ్యంలోని ప్రభుత్వం త్వరలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సాధారణ ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం తిరిగి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సారి ఎన్నికల ముందు వచ్చే మధ్యంతర బడ్జెట్‌ మార్కెట్లో జోష్‌ నింపుతుందని పలువురు ఆశిస్తున్నారు. ఎన్నికల వేళ మధ్యతరగతికి, రైతులకు ప్రయోజనకర చర్యలను బడ్జెట్లో ప్రవేశపెట్టవచ్చని అంచనా. ఇలాంటి చర్యలు సాధారణంగా వినిమయాన్ని పెంచుతాయి. అయితే కొందరు అనలిస్టులు మాత్రం ఇలాంటి చర్యలు మార్కెట్లో భయాలను పెంచి పతనానికి దారితీయవచ్చని అభిప్రాయపడుతున్నారు. 
ఏం ఉండొచ్చు?
బడ్జెట్లో సార్వజనీన మౌలికాదాయ పథకం(యూబీఐ)ని ప్రవేశ పెడతారని ప్రభుదాస్‌ లీలాధర్‌ ప్రతినిధి అజయ్‌ బోడ్కే అభిప్రాయపడ్డారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయలేమిని పరిష్కరించే వీలుకలుగుతుందన్నారు. దీంతో పాటు మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు ఆదాయపన్ను పరిమితి పెంచడం లేదా పన్ను రేట్లను తగ్గించడం వంటివి ఉండొచ్చన్నారు. ఎప్పటినుంచో తీసుకురాదలిచిన వెహికల్‌ స్క్రాపేజ్‌ పాలసీ తీసుకువచ్చే ఛాన్సులున్నాయి. ఆటో రంగానికి చేయూతనిచ్చేలా యూఎస్‌లో తెచ్చిన క్లంకర్‌ పాలసీ లాంటి దాన్ని ప్రవేశపెట్టవచ్చని అజయ్‌ అంచనా. ఫిక్కీ, సీఐఐలు ఆదాయపన్ను పరిమితి తగ్గించడం, పన్నుల కుదింపు లాంటి చర్యలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాయి. బడ్జెట్లో కస్టమ్స్‌డ్యూటీని పునర్‌వ్యవస్థీకరించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో వినిమయం, ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో వినిమయం పెంచడం తద్వారా ఎకానమీకి జోష్‌ తీసుకురావడం కోసం చర్యలుంటాయని బిర్లాసన్‌లైఫ్‌ అభిప్రాయపడుతోంది. మరికొంతమంది ఉపాధి కల్పన కార్యక్రమాలను ప్రకటించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 
ఎంత ఛాన్సు?
జీఎస్‌టీ వసూళ్లు తగ్గిన తరుణంలో ప్రభుత్వం భారీ పథకాలను ప్రకటించే సాహసం చేయకపోవచ్చని ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడుతోంది. విత్తలోటు పెరిగిపోయేలాంటి పెద్దపెద్ద ప్రకటనలు చేస్తే మార్కెట్లు భయపడి కుదేలవుతాయని హెచ్చరించింది. అదేవిధంగా ఈ దఫా ఎలాంటి కార్పొరేట్‌ రేట్‌కట్స్‌ ఉండకపోవచ్చని అంచనా వేసింది. ఆదాయపన్నుకు కూడా స్వల్ప సవరణలే ఉండొచ్చని తెలిపింది. అందువల్ల ప్రభుత్వం ప్రకటించే బడ్జెట్‌తో మార్కెట్‌ మురిసిపోయే అవకాశాలు తక్కువని తెలిపింది. ప్రభుత్వం ప్రకటించే యూబీఐ లాంటి పథకాల తీరుతెన్నుల చూసిన తర్వాతే మార్కెట్లు ప్రతిస్పందిస్తాయని ప్రభుదాస్‌ లీలాధర్‌ తెలిపింది. ప్రభుత్వం పప్పుబెల్లాలాగా నిధులు పంచేందుకు అవకాశం లేదని, రుణమాఫీ లాంటి పెద్ద చర్యలను ‍ప్రకటించకపోవచ్చని సుందరమ్‌ ఎంఎఫ్‌ అంచనా వేసింది. అసలీ మధ్యంతర బడ్జెట్‌ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయపడింది. ఫిబ్రవరి 1న అరుణ్‌ జైట్లీ మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందుంచుతారు. You may be interested

10750 పాయింట్ల దిగువకు నిఫ్టీ

Monday 14th January 2019

36వేల దిగువకు సెన్సెక్స్‌ 10750 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ చివరి గంటలో రికవరీ మెటల్‌, అటో, ప్రైవేట్‌ రంగ షేర్ల పతనంతో మార్కెట్‌ మూడోరోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 156 పాయింట్లు నష్టపోయి 35853 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు కోల్పోయి 10737.60 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అస్థితర సైతం సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపింది. నేడు డబ్ల్యూపీఐ గణాంకాల విడుదలతో పాటు వివిధ కంపెనీల క్యూ3 ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల

జెట్‌ ఎయిర్‌వేస్‌ 16శాతం జూమ్‌..!

Monday 14th January 2019

రుణ పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తుందనే వార్తలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ సోమవారం 17శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.253.5ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ‘గుదిబండగా మారిన రుణభారాన్ని తగ్గించుకునే పరిష్కార ప్రణాళికల్లో భాగంగా కంపెనీకి రుణదాతలతో ఈ వారంలో బోర్డు సమావేశం నిర్వహించనుందనే ఒక ప్రముఖ టీ.వీ ఛానెల్‌ వార్తల్ని ప్రసారం చేసింది. అలాగే ప్రస్తుత ప్రధాన ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌ కంపెనీలో 10శాతం వాటాను

Most from this category