STOCKS

News


పార్లమెంట్‌లో బిజెనెస్‌

Saturday 9th February 2019
news_main1549699749.png-24109

  • విదేశీ కార్యకలాపాల కుదింపు దిశగా బ్యాంకులు

విదేశాల్లో తమ బిజినెస్‌ కార్యకలాపాల కుదింపునకు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి గుర్తించిన కార్యకలాపాల సంఖ్య జనవరి 15 నాటికి 54గా ఉంది.  ఇందులో 29 కార్యకలాపాలు కేవలం వ్యయ నియంత్రణలో భాగంగా నిలిచిపోతున్నాయి.  మిగిలినవి వ్యాపార వ్యూహం, పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా నిలిచిపోతున్నాయి. బ్యాంకులు పరస్పర సంప్రతింపుల ద్వారా ఈ దిశగా చర్యలు తీసుకుంటుండడం గమనార్హం. ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా పార్లమెంటుకు ఈ  విషయం తెలిపారు. 2019, జనవరి 31వ తేదీ వరకూ చూస్తే, సబ్సిడీలు, జాయింట్‌ వెంచర్లు, ప్రాతినిధ్య కార్యాలయాలుసహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు 165 విదేశీ బ్రాంచీలను నిర్వహిస్తున్నాయి. వీటిలో మొదటిస్థానంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (52), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (50), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (29) ఉన్నాయి. ఇక బ్రిటన్‌లో అత్యధికంగా (32) బ్రాంచీలు ఉండగా, తరువాతి స్థానాల్లో హాంకాంగ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (13 చొప్పున) ఉన్నాయి. సింగపూర్‌ (13) తరువాతి స్థానంలో ఉంది. 2016-17లో దాదాపు 41 బ్రాంచీలు నష్టాలను నమోదుచేసుకున్నాయి.

  • ఏటీఎం మోసాలపై నిర్దిష్ట సమాచారం లేదు...

ఎటీఎం మోసాలపై నిర్దిష్ట సమాచారం ఏదీ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా శుక్లా తెలిపారు. అయితే లక్ష రూపాయలు ఆపైబడిన మోసాల సంఖ్యను ఆయన వెల్లడించారు. 2017-18లో రూ.లక్ష ఆపైన ఏటీఎం మోసాల సంఖ్య 911గా ఉందన్నారు. 2016-17లో ఈ సంఖ్య 724గా ఉంటే, 2015-16లో 563 అని తెలిపారు.

  • 100 కోట్లు పైన ఆదాయం... పెరుగుతున్న సంఖ్య

 రూ.100 కోట్లకు పైగా స్థూల ఆదాయం ఉన్నట్లు 2017-18 ఆర్థిక సంవత్సరంలో డిక్లేర్‌ చేసిన వారు కేవలం 61మందేనని ఆర్థికశాఖ సహాయమంత్రి పొన్‌ రాథాకృష్ణన్‌ లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. అయితే 2016-17తో పోల్చితే  (38)  ఈ సంఖ్య  భారీగా పెరగడం గమనార్హం. 2014-15లో 24గా ఉన్న ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఒక వ్యక్తిని ‘బిలియనీర్‌’ అని పేర్కొనడానికి ఒక నిర్దిష్ట అధికార నిర్వచనం ఏదీ లేదని కూడా మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

  • 2,000కుపైగా బినామీ లావాదేవీల గుర్తింపు

2018 డిసెంబర్‌ నాటికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు 2,000కుపైగా బినామీ లావాదేవీలను గుర్తించినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి శివ్‌ ప్రతాప్‌ శుక్లా తెలిపారు. దాదాపు రూ.6,900 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు కూడా తెలిపారు. బినామీ ఆస్తుల లావాదేవీల చట్టం కింద ఆయా అంశాలపై చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించరి 1,800 కేసులు నమోదయినట్లు పేర్కొన్న ఆయన బినామీ ఆస్తులుగా జప్తు చేసిన వాటిలో బ్యాంకుల్లో డిపాజిట్లు, భూములు, ఫ్లాట్స్‌, ఆభరణాల వంటివి ఉన్నాయన్నారు.  

  • తగ్గుతున్న మొండిబకాయిల విలువ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో ఎన్‌పీఏల (మొండిబకాయిల) విలువ రూ.8,64,433 కోట్లని లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో మంత్రి శుక్లా తెలిపారు. మార్చి 2018 నాటి విలువతో పోల్చిచూస్తే రూ.31,168 కోట్లు తగ్గాయని మంత్రి వివరించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం,  గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బ్యాంకుల మొండిబకాయిలు రూ.8,96,601 కోట్లు. జూన్‌ 2018 నాటికి ఈ విలువ రూ.8,75,619 కోట్లకు తగ్గింది. ప్రభుత్వ చర్యలు దీనికి కారణమన్నారు.  ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ యోచనఏదీ లేదని కూడా మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.You may be interested

నష్టంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 9th February 2019

సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం రాత్రి 10,927.50 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10957.25 పాయింట్లతో పోలిస్తే 20పాయింట్ల నష్టంతో ఉంది. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ నష్టంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ నెగిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక మనమార్కెట్‌ విషయానికొస్తే ...ప్రపంచమార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలకు తోడు, దేశీయ మార్కెట్లలో లాభాల స్వీకరణ కారణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా

అక్టోబర్‌ - డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు

Saturday 9th February 2019

పెరిగిన నాగార్జున ఫెర్టిలైజర్స్‌ నష్టాలు డిసెంబరు క్వార్టరు స్టాండలోన్‌ ఫలితాల్లో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ రూ.179 కోట్ల నికరనష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.10 కోట్ల నష్టం పొందింది. ఏప్రిల్‌-డిసెంబరు పీరియడ్‌లో రూ.1,439 కోట్ల టర్నోవరుపై రూ.352 కోట్ల నికరనష్టం చవిచూసింది. ఎమ్‌ఆర్‌పీఎల్‌ నష్టాలు రూ.268 కోట్లు దెబ్బతీసిన రిఫైనరీ మార్జిన్లు న్యూఢిల్లీ: మంగళూర్‌ రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్స్‌(ఎమ్‌ఆర్‌పీఎల్‌) కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌-డిసెంబర్‌

Most from this category