STOCKS

News


వ్యాపారాలను వదలని అవినీతీ

Friday 2nd November 2018
news_main1541141107.png-21656

  • కంపెనీ మనుగడ సాగించాలంటే తప్పదు
  • కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే ఇచ్చుకోవాలి
  • 52 శాతం కంపెనీల ప్రతినిధుల అభిప్రాయమిదే
  • వర్ధమాన మార్కెట్లపై ఈవై సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: లంచాలు, అక్రమార్జన అనేవి భారత్‌ సహా వర్ధమాన మార్కెట్లలో అత్యధిక స్థాయిలో ఉన్నట్టు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) నిర్వహించిన సర్వేలో తేలిసింది. వ్యాపారాల్లో అవినీతి, లంచాలు తారస్థాయిలో ఉన్నాయని ఈవై సర్వేలో 52 శాతం మంది చెప్పడం గమనార్హం. మన దేశంలోనూ 40 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘భారత్‌లో 40 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు వ్యాపారాల్లో అవినీతి అక్రమార్జన విధానాలు విస్తృతంగా ఉన్నాయని చెప్పారు. 12 శాతం మంది గత రెండేళ్లలో తమ కంపెనీ పెద్ద ఎత్తున మోసాలను చవిచూసినట్టు చెప్పారు. 20 శాతం మంది నగదు చెల్లింపులు అన్నవి వ్యాపారం నిలదొక్కుకునేందుకు అవసరమన్నారు’’ అని ఈవై నివేదిక తెలియజేసింది.
భారత్‌లో కార్పొరేట్‌ పరిపాలన, పారదర్శకతను పెంపొందించేందుకు... అవినీతి నిరోధక చట్టం 2018, కంపెనీల చట్టం 2017, ఐబీసీ, నిబంధనలు పాటించకపోతే జరిమానాల వంటి పలు ప్రయత్నాలు జరిగినట్టు ఈవై తెలిపింది. ‘‘అయినప్పటికీ మోసం, అవినీతి అనేవి వృద్ధికి ప్రధాన అడ్డంకులు. మీడియాలో తరచుగా అవినీతికి సంబంధించి పెద్ద కేసులను చూపించడం వల్ల సంబంధిత ప్రాంతంలో వ్యాపారాలను నిర్వహించే కంపెనీల ప్రతిష్టకు రిస్క్‌ ఉంటుంది’’ అని ఈవై అభిప్రాయం వ్యక్తం చేసింది. చాలా వర్ధమాన దేశాల్లో కొత్త చట్టాల అమలు, నిఘాను పెంచడం, మోసాల నివారణకు కంపెనీల స్వీయ కార్యాచరణ వంటివి చేపట్టినాగానీ సెంటిమెంట్‌ బలహీనంగానే ఉందని ఈవై తెలిపింది. అక్రమాలను ముందే గుర్తించి నిరోధించేందుకు ఫోరెన్సిక్‌ డేటా అనలటిక్స్‌ వినియోగం వంటి చర్యలు అవసరమని సూచించింది. ఈవై ఫోరెన్సిక్‌ అండ్‌ ఇంటెగ్రిటీ సర్వీసెస్‌ ఈ సర్వేను నిర్వహించింది. భారత్‌తోపాటు జపాన్‌, చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ సహా 33 వర్ధమాన మార్కెట్లకు సంబంధించి 1,450 ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాలను సేకరించింది.
ఆసక్తికర అంశాలు

- వ్యాపారానికి మోసాలు, అవినీతి అతిపెద్ద ముప్పు అని 42 శాతం మంది చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా చెప్పిన వారు 29 శాతమే.
- కంపెనీ మనుగడ సాగించాలంటే కొంత మేర ప్రోత్సాహకాలు ఇవ్వక తప్పని పరిస్థితిగా చాలా సంస్థలు చెప్పడం గమనార్హం.
- కాంట్రాక్టులను సొంతం చేసుకునేందుకు లంచాలన్నవి సాధారణమేనని 16 శాతం మంది చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా చెప్పిన వారు 5 శాతం మంది ఉన్నారు.
- వ్యాపార ప్రయోజనాల కోసం నగదు రూపేణా ప్రోత్సాహకం ఇవ్వడం ఆమోదనీయమేనని వర్ధమాన మార్కెట్లలో 19 శాతం మంది చెప్పారు. దీన్ని సమర్థించే విషయంలో 33 వర్ధమాన దేశాల్లో భారత్‌ 12వ స్థానంలో, చైనా 6వ స్థానంలో ఉన్నాయిYou may be interested

జీఎస్టీ వసూళ్లు మళ్లీ లక్ష కోట్లు

Friday 2nd November 2018

- ఐదు నెలల తర్వాత అక్టోబర్‌లో రూ.1,00,710 కోట్లు న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఐదు నెలల తర్వాత మళ్లీ లక్షకోట్లు దాటాయి. పండుగల సీజన్‌, పన్ను ఎగవేత నిరోధక చర్యల తీవ్రతరం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ఆర్థికమంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- అక్టోబర్‌లో రూ. 1,00,710 కోట్ల జీఎస్‌టీ వసూళ్లు జరిగాయి. వ్యాపార విభాగానికి సంబంధించి 67.45 లక్షల  రిటర్న్స్‌ దాఖలయ్యాయి.

హెచ్‌ఎస్‌ఐఎల్‌ మరో ప్లాంట్‌

Friday 2nd November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: హింద్‌వేర్‌ బ్రాండ్‌తో శానిటరీ వేర్‌ తయారీలో ఉన్న హెచ్‌ఎస్‌ఐఎల్‌ మరో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం కంపెనీకి హైదరాబాద్‌ సమీపంలోని బీబీ నగర్‌తోపాటు హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో శానిటరీ వేర్‌ తయారీ కేంద్రాలున్నాయి. మూడవ యూనిట్‌ను పోర్టు సమీపంలో నెలకొల్పుతామని హెచ్‌ఎస్‌ఐఎల్‌ సీఎండీ రాజేంద్ర కె సొమానీ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ఎప్పుడు, ఎ‍క్కడ నెలకొల్పేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ‘ప్రస్తుతమున్న ప్లాంట్లు పూర్తి స్థాయిలో

Most from this category