జీడీపీ వృద్ధికి ఎగుమతులు కీలకం
By Sakshi

ముంబై: 2025 నాటికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే ఎగుమతులు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు గత నాలుగేళ్లలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, రెరా, జీఎస్టీ, ఐబీసీ వంటి సంస్థాగత సంస్కరణలు ఇందులో భాగమేనని తెలియజేశారు. గురువారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలంలో దేశం అధిక వృద్ధి సాధించేందుకు ఇవి గణనీయంగా తోడ్పడగలవని పేర్కొన్నారు. అయితే, వచ్చే మూడు దశాబ్దాల్లో 9-10 శాతం జీడీపీ వృద్ధి స్థాయి సాధించాలంటే ఎగుమతులను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. "ఎగుమతులు లేకుండా ఏ దేశం కూడా ఎదగలేదు. జపాన్, కొరియా, చైనా.. ఇవన్నీ కూడా ఎగుమతుల ఊతంతో వృద్ధి చెందినవే. కాబట్టి భారత్ కూడా ఎగుమతులను మరింతగా పెంచుకోవాలి. ఇందుకోసం తయారీ పరిమాణాన్ని పెంచుకోవాలి.. అంతర్జాతీయ మార్కెట్లలోకి మరింతగా విస్తరించాలి" అని కాంత్ తెలిపారు. ఇలాంటివి సాధించాలంటే ప్రభుత్వం నుంచి తోడ్పాటుతో టీసీఎస్ వంటి అనేక చాంపియన్ కంపెనీలు అవసరమని చెప్పారు.
You may be interested
కార్ల కంపెనీల ధరల హారన్
Friday 14th December 2018న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగ దిగ్గజ సంస్థలన్నీ జనవరి ఒకటి నుంచి కార్ల ధరల పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలు పెంపు ప్రకటనలు చేశాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఒక్కోక్కటిగా వివరణ ఇస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన అధికారిక సమాచారం ప్రకారం కనీసం 1.5 నుంచి 4 శాతం వరకు కార్లు, ప్యాసింజర్ వాహనాల ధరలు వచ్చే
పీసీఏ, ఒక్కరోజు ఎగవేత నిబంధనలు సడలించండి
Friday 14th December 2018ముంబై: ఆర్బీఐ నూతన గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ముంబైలో ప్రభుత్వరంగ బ్యాంకుల సారథులతో భేటీ అయ్యారు. అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఆర్బీఐ అనుసరిస్తున్న కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ), రుణ చెల్లింపుల్లో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా ఖాతాలను ఎన్పీఏలుగా వర్గీకరించడమనే నిబంధనలను సడలించాలని ఈ సందర్భంగా ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులు కోరారు. అలాగే, బ్యాంకులు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై దాస్తోపాటు ఆర్బీఐకి చెందిన నలుగురు