STOCKS

News


గవర్నెన్స్ విధానంపై లోతుగా అధ్యయనం

Saturday 15th December 2018
news_main1544849116.png-22952

ముంబై: కొత్త గవర్నర్‌గా నియమితులైన శక్తికాంత దాస్‌ సారథ్యంలో శుక్రవారం తొలిసారిగా భేటి అయిన ఆర్‌బీఐ బోర్డు.. గవర్నెన్స్‌ విధానాలపై మరింత లోతుగా పరిశీలన జరపాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, దేశీయంగాను.. అంతర్జాతీయంగాను ఎదురవుతన్న సవాళ్లు, లిక్విడిటీ, రుణ వితరణ, కరెన్సీ నిర్వహణ, ఆర్థిక అక్షరాస్యత తదితర అంశాలపై చర్చించింది. ’ఆర్‌బీఐ గవర్నెన్స్‌ అంశంపై బోర్డు చర్చించింది. దీన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది’ అని రిజర్వ్‌ బ్యాంక్‌ పేర్కొంది. దాదాపు నాలుగు గంటల పాటు ఈ సమావేశం సాగిన సమావేశం అనంతరం ఆర్‌బీఐ క్లుప్తంగా ఒక ప్రకటన జారీ చేసింది. 2017–18లో బ్యాంకింగ్‌ తీరుతెన్నులు, పురోగతి విషయాలకు సంబంధించిన ముసాయిదా నివేదిక గురించి 18 మంది సభ్యుల బోర్డు చర్చించినట్లు వెల్లడించింది. 
    రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మాజీ బ్యూరోక్రాట్‌ శక్తికాంత దాస్‌ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. 25వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాస్‌ సారథ్యంలో బోర్డు సమావేశం కావడం ఇదే తొలిసారి. గతంలో ఉర్జిత్‌ పటేల్‌ సారథ్యంలో నవంబర్‌ 19న ఆర్‌బీఐ బోర్డు సమావేశమైంది. దాదాపు పది గంటల పాటు ఇది సాగింది. రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద ఎంత స్థాయిలో అత్యవసర నిల్వలు ఉండాలి తదితర అంశాలను సూచించేందుకు ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో బోర్డు నిర్ణయించింది. అయితే, ఆరుగురు సభ్యులతో ఏర్పాటు కావాల్సిన ఈ కమిటీకి చైర్మన్‌గా ఎవరిని నియమించాలన్న విషయంలో కేంద్రం, ఆర్‌బీఐకి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రతిపాదన ముందుకు సాగలేదు. 



You may be interested

పెరగనున్న హోండా కార్ల ధరలు

Saturday 15th December 2018

న్యూఢిల్లీ: దేశీ ఆటోరంగ సంస్థ హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సీఐఎల్‌) ఉత్పత్తి చేస్తున్న అన్ని మోడళ్ల ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ అంశంపై వివరణ ఇచ్చిన కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) రాజేష్ గోయల్.. ‘ముడి పదార్థాల ధరలు 4 శాతం పెరిగాయి. ఈ కారణంగా

రుణ మాఫీ హామీలు సరికాదు

Saturday 15th December 2018

న్యూఢిల్లీ: ఎన్నికల్లో రాజకీయ పార్టీలిస్తున్న రుణాల మాఫీ హామీలను రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరు రఘురామ్‌ రాజన్‌ తప్పుబట్టారు. రుణాల మాఫీ అనేది ఎన్నికల హామీల్లో భాగం కాకూడదన్నారు. ‘‘దీనివల్ల వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుంది. రాష్ట్రాల ద్రవ్య పరిస్థితులపై ఒత్తిడికి దారి తీస్తుంది’’ అన్నారాయన. పార్టీలు ఇలాంటి హామీలివ్వకుండా చూడాలంటూ తాను ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాసినట్లు చెప్పారాయన. ‘‘నిజం చెప్పాలంటే వ్యవసాయ రంగంలోని నైరాశ్య

Most from this category