STOCKS

News


భారత్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేసిన బీఎన్‌పీ పారిబా

Tuesday 2nd April 2019
news_main1554185017.png-24925

దేశీయ మార్కెట్‌ రేటింగ్‌ను న్యూట్రల్‌ నుంచి ఓవర్‌వెయిట్‌కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు బీఎన్‌పీ పారిబా ప్రకటించింది. దీంతో పాటు సెన్సెక్స్‌ డిసెంబర్‌ టార్గెట్‌ను 40వేల నుంచి 42 వేలకు పెంచింది. ఎర్నింగ్స్‌లో స్థిరత్వం, ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహ వేగం కారణంగా మార్కెట్‌పై పాజిటివ్‌గా మారినట్లు తెలిపింది. గతేడాది జూన్‌లో సంస్థ దేశీయ ఈక్విటీల రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌ నుంచి న్యూట్రల్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. డౌన్‌గ్రేడింగ్‌కు ఎర్నింగ్స్‌పై అనుమానాలు, రూపీ క్షీణత, చమురు ధరల పెరుగుదల, అధిక వాల్యూషన్లు కారణంగా చూపింది. అయితే తాజాగా ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని సంస్థ ఏసియా పసిఫిక్‌ ప్రాంత వ్యూహకర్త మనిషి రేచౌధురి చెప్పారు. అయితే ప్రైవేట్‌ పెట్టుబడుల వాతావరణం ఇంకా మెరుగుపడలేదన్నారు. బ్యాంకుల ఎన్‌పీఏ సమస్యలు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పారు. ఎన్‌డీఏ ప్రభుత్వం మరలా ఎన్నికవుతుందన్న అంచనాలో నిధుల ప్రవాహం పెరిగిందని, దీంతో వాల్యూషన్లు మరలా పెరుగుతున్నాయని చెప్పారు. ఇటీవల గోల్డ్‌మన్‌ సాక్స్‌, మోర్గాన్‌ స్టాన్లీ సైతం భారత మార్కెట్‌పై పాజిటివ్‌ ధృక్పథం వెలిబుచ్చాయి. భారతమార్కెట్‌ రేటింగ్‌ను గోల్డ్‌మన్‌ సాక్స్‌ ఓవర్‌వెయిట్‌కు అప్‌గ్రేడ్‌ చేసి నిఫ్టీ డిసెంబర్‌ టార్గెట్‌ను 12500 పాయింట్లకు పెంచింది. మోర్గాన్‌ స్టాన్లీ సెన్సెక్స్‌ ఏడాది టార్గెట్‌ను 42వేల పాయింట్లకు పెంచింది. 
రూపీ, ఎర్నింగ్స్‌
రూపాయి గతేడాది చివర్లో భారీగా పతనం కావడంపై ఆందోళన వ్యక్తం చేసిన బీఎన్‌పీ పారిబా, తాజాగా కరెన్సీపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల రూపీలో వచ్చిన ర్యాలీ కరెన్సీపై ఆందోళనలను దూరం చేసిందని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఎర్నింగ్స్‌ వృద్దిలో 14-16 శాతం పెరుగుదల ఉండొచ్చని అంచనా వేసింది. జీడీపీ సైతం అంచనాలకు అనుగుణంగానే ఉండొచ్చని పేర్కొంది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రైవేట్‌ క్యాపెక్స్‌ ఊపందుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం దేశీ మార్కెట్లోకి కొనసాగుతున్న విదేశీ మదుపరుల నిధుల ప్రవాహం ఇలాగే మరికొంత కాలం కొనసాగవచ్చని అంచనా వేసింది. మార్కెట్‌ అనుకూల ప్రభుత్వం వస్తే ఎఫ్‌ఐఐలు ఇతర ఆసియా దేశాల కన్నా భారత్‌వైపే ఎక్కువ శ్రద్ధ పెడతాయని పేర్కొంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఒకటి రెండు నెలలు ఈ ప్రవాహం ఉంటుందని, మూడో నెలనుంచి క్రమంగా తగ్గుతుందని తెలిపింది. You may be interested

బ్రోకరేజీల ‘డిస్కౌంట్ల’ పోరు

Tuesday 2nd April 2019

-చౌకగా కొత్త తరం బ్రోకరేజ్‌ సంస్థల ఆఫర్లు -ఆకర్షితులవుతున్న రిటైల్‌ ఇన్వెస్టర్లు  -దిగి వస్తున్న పెద్ద బ్రోకరేజ్‌ సంస్థలు  -డిస్కౌంట్‌ ఆఫర్లు ప్రకటించిన ఏంజెల్‌ బ్రోకింగ్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ముంబై: కొత్త తరం స్టాక్‌ బ్రోకరేజ్‌ సంస్థల ధాటికి సంప్రదాయ బ్రోకరేజ్‌ సంస్థలు దిగిరాక తప్పడం లేదు. జీరోధా, విజ్‌డమ్‌ క్యాపిటల్‌, ఆర్‌కేఎస్‌వీ సెక్యూరిటీ  తదితర సంస్థలు చాలా తక్కువ బ్రోకరేజ్‌ ఫీజులు ఆఫర్‌ చేయడం ద్వారా వ్యాపార పరిమాణాన్ని పెంచుకుంటున్నాయి. దీంతో యాక్సిస్‌ సెక్యూరిటీస్‌,

ఎలార టెక్నాలజీస్‌ చేతికి ఫాస్ట్‌ఫాక్స్‌డాట్‌కామ్‌

Tuesday 2nd April 2019

డీల్‌ విలువ రూ.100 కోట్లు  న్యూఢిల్లీ: హోమ్‌ రెంటల్‌ బ్రోకరేజ్‌ ప్లాట్‌ఫార్మ్‌ ఫాస్ట్‌ఫాక్స్‌డాట్‌కామ్‌ను ఎలార టెక్నాలజీస్‌ కొనుగోలు చేసింది. ఈ సంస్థ కొనుగోలుతో తాము ఆన్‌లైన్‌-టు-ఆఫ్‌లైన్‌ హోమ్‌ రెంటల్స్‌ విభాగంలో(ఈ మార్కెట్‌ సైజు రూ.20,000 కోట్లుగా ఉంటుందని అంచనా)కి ప్రవేశించినట్లయిందని సింగపూర్‌కు చెందిన ఎలార టెక్నాలజీస్‌ తెలిపింది. ఈ ఈలావాదేవీ విలువ రూ.100 కోట్లు. భారత్‌లో బాగా ప్రాచుర్యం పొందిన మూడు రియల్టీ పోర్టళ్లు-హౌసింగ్‌డాట్‌కామ్‌, ప్రాప్‌ టైగర్‌, మకాన్‌లను కూడా ఎలార

Most from this category