STOCKS

News


వ్యాపారంపై తగ్గిన విశ్వాసం!

Tuesday 15th January 2019
news_main1547536004.png-23599

  • జనవరి-మార్చి మధ్య
  • పరిస్థితిపై డీఅండ్‌బీ నివేదిక

న్యూఢిల్లీ: వ్యాపార ఆశావాదం జనవరి-మార్చి త్రైమాసికానికి తగ్గింది. డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ (డీ అండ్‌ బీ)కాంపోజిట్‌ బిజినెస్‌ ఆప్టమిజమ్‌ ఇండెక్స్‌ ఈ త్రైమాసికానికి సంబంధించి 73.8గా ఉంది. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంతో పోల్చిచూస్తే, ఈ సూచీ 7 శాతం తగ్గింది. వచ్చే కొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల ఫలితంపై అనిశ్చితి, సంస్కరణల అజెండా కొనసాగడంపై సందేహాలు వ్యాపార ఆశావహ సూచీ తగ్గడానికి కారణమని డీ అండ్‌ బీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీష్‌ సిన్హా పేర్కొన్నారు. అమెరికా మందగమనం, ప్రపంచ ఆర్థిక వృద్ధి బలహీనత వంటి అంశాలూ దేశీయ వృద్ధిపై ఆందోళనలను పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాపార అంచనాలపై వ్యాపార ప్రతినిధులు ఆరు అంశాలపై ఇచ్చిన అభిప్రాయాల ఆధారంగా సూచీ కదలికలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.  సూచీకి సంబంధించి పరిగణనలోకి తీసుకునే మొత్తం ఆరు ప్రమాణాల్లో ఐదు ( నికర ఆదాయం, కొత్త ఆర్డర్లు, అమ్మకాల పరిమాణం, నిల్వలు, అమ్మకపు ధర) అక్టోబర్‌-డిసెంబర్ మధ్య కాలంతో పోల్చితే ప్రతికూలతను నమోదుచేసుకున్నాయి. దీనితో ఉపాధి కల్పనకు సంబంధించి ఆశావహ పరిస్థితి 7 శాతం పెరిగినా, మొత్తంమీద ఫలితం ప్రతికూలంగానే నమోదయ్యింది.



You may be interested

మహిళా వ్యాపారవేత్తలకు కేంద్రం తోడ్పాటు

Tuesday 15th January 2019

న్యూఢిల్లీ:  గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం) పోర్టల్‌లో వివిధ ఉత్పత్తులను విక్రయించేలా మరింత మంది మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలను (ఎస్‌హెచ్‌జీ) ప్రోత్సహించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉమనియా పేరిట జీఈఎం పోర్టల్‌లో ప్రత్యేకంగా హోమ్‌పేజీ రూపొందించింది. [https://gem.gov.womaniya] ఈ పేజీలో మహిళా వ్యాపారవేత్తలు విక్రయించే ఉత్పత్తులు, సర్వీసుల గురించి వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు వివరాలు లభిస్తాయని ప్రభుత్వం

భారీగా పెరిగిన పీఈ, వీసీ పెట్టుబడులు

Tuesday 15th January 2019

2018లో 2.45 లక్షల కోట్ల రాక అంతకుముందు ఏడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధి ఉపసంహరణ విలువ రూ.1.82 లక్షల కోట్లు ముంబై: ప్రైవేటు ఈక్విటీ(పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) పెట్టుబడులు గతేడాది భారీ ఎత్తున వచ్చాయి. 2017లో 26.1 బిలియన్‌ డాలర్లు ఈ రూపంలో రాగా, 2018లో ఏకంగా 35 శాతం అధికంగా 35.1 బిలియన్‌ డాలర్ల (రూ.2,45,700 కోట్లు) మేర పెట్టుబడులు తరలివచ్చాయి. భారీ డీల్స్‌ 2017లో చోటు చేసుకోవడమే ఈ

Most from this category