STOCKS

News


ఎకానమీ వృద్ధికి మరిన్ని చర్యలు అవసరం

Friday 30th November 2018
news_main1543554654.png-22508

బెంగళూరు: ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బయోఫార్మా సంస్థ బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత, గత ప్రభుత్వాలు కొన్ని మంచి చర్యలు తీసుకున్నాయని, కానీ ఎకానమీని మెరుగు పరిచేందుకు అవసరమైన స్థాయిలో ప్రయత్నాలు జరగలేదని ఆమె పేర్కొన్నారు. బెంగళూరు టెక్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానాన్ని మోదీ సర్కార్‌ అమల్లోకి తెచ్చిందని ఆమె చెప్పారు. కాకపోతే పరిష్కరించాల్సిన అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయన్నారు. నియంత్రణ నిబంధనలను సడలిస్తే వ్యాపార సంస్థలకు తోడ్పాటుగా ఉంటుందని, ఎకానమీ వృద్ధికి దోహదపడగలదని ఆమె తెలిపారు. బయోటెక్నాలజీ పరిశ్రమ ఎగుమతి ఆధారితమైనందున.. పన్నుపరమైన సంస్కరణల ప్రభావం దీనిపై స్పల్పమేనన్నారు. అయితే, బయోటెక్నాలజీ రంగంపై గణనీయంగా నియంత్రణలు ఉన్నాయని, వీటిని సడలించాల్సిన అవసరం ఉందని మజుందార్ షా చెప్పారు. 



You may be interested

2019 చివరికల్లా 14,000 పాయింట్లకు నిఫ్టీ..!

Friday 30th November 2018

ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెట్స్‌ అండ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌) సంజీవ్‌ భాసిన్‌ అంచనా. ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కంపెనీలు ప్రకటించనున్న కార్పొరేట్‌ ఫలితాలు దేశీ స్టాక్‌ మార్కెట్లను పరుగులు పెట్టించనున్నాయని సంజీవ్‌ భాసిన్‌ విశ్లేషించారు. కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ వృద్ధి 18 శాతం ఉండనుందని అంచనావేసిన ఈయన.. వచ్చే ఏడాదిలో నిఫ్టీ 10,000 నుంచి 12,000 పాయింట్ల మధ్యకు చేరుకుంటుందన్నారు. దీపావళి సమయానికి 14,000 పాయింట్లను తాకుతుందని ఒక ఆంగ్ల

8 శాతం వృద్ధి కోసం మరిన్ని సంస్కరణలు

Friday 30th November 2018

న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటును 8 శాతానికి పైగా తీసుకెళ్లేందుకు మరిన్ని సంస్కరణలు అవసరమని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. అలాగే, తక్కువ వడ్డీ రేట్లతోపాటు సమృద్ధిగా నిధుల అందుబాటులో ఉండటమన్నది అధిక వృద్ధికి అవసరమని అభిప్రాయపడ్డారు. దేశ జీడీపీ వృద్ధి 2016-17లో 7.1 శాతం, 2017-18లో 6.7 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. గురువారమిక్కడ ‘పెహలే ఇండియా ఫౌండేషన్‌’ నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్‌కుమార్‌

Most from this category