STOCKS

News


అదిక వేతనాలు బెంగళూరులోనే!

Friday 23rd November 2018
news_main1542948847.png-22334

హైదరాబాద్‌: దేశంలో అన్ని నగరాల్లో కంటే బెంగళూరులోనే వేతనాలు ఎక్కువ అని లింక్డ్‌ఇన్‌ తాజా శాలరీ సర్వే వెల్లడించింది. అందరూ అనుకున్నట్లు అధిక వేతనాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు దక్కడం లేదని పేర్కొంది. అధిక వేతనాలను హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌ ఉద్యోగులు ఎగరేసుకు పోతున్నారని వెల్లడించింది. లింక్డ్‌ఇన్‌కు భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లున్నారు. అమెరికా తర్వాత లింక్డ్‌ఇన్‌కు అధిక యూజర్లు ఉన్నది మన దేశంలోనే. తన ప్లాట్‌ఫామ్‌పై ఉన్న డేటా ఆధారంగా లింక్డ్‌ఇన్‌ సంస్థ రూపొందించిన ఈ శాలరీ సర్వే వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలివీ...
♦ భారత్‌లో అధిక వేతనాలు బెంగళూరులోనే ఉన్నాయి. సగటు వేతనం ఏడాదికి రూ.12 లక్షలుగా ఉంది. రూ.9 లక్షల సగటు వేతనంతో  ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లు రెండో స్థానంలో ఉన్నాయి. రూ.8.5 లక్షల సగటు వేతనంతో హైదరాబాద్‌ మూడో స్థానంలో, రూ.6.3 లక్షల వేతనంలో చెన్నై నాలుగో స్థానంలో నిలిచాయి. 
♦ హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌ ఉద్యోగులు ఏడాదికి రూ.15 లక్షల వరకూ వేతనం పొందుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు రూ.12 లక్షల వరకూ, వినియోగ రంగంలోని ఉద్యోగులు రూ.9 లక్షల వరకూ వేతనం పొందుతున్నారు. 
♦ హార్డ్‌వేర్‌ జాబ్స్‌ అంటే సంప్రదాయ హార్డ్‌వేర్‌ ఉద్యోగాలు కాదు. చిప్‌ డిజైన్‌, కొత్త తరం నెట్‌వర్కింగ్‌ రంగంలోని ఉద్యోగాలు. వందలాది, వేలాది ట్రాన్సిస్టర్ల, డివైజ్‌ల సమ్మేళనంతో ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌లను (ఐసీ) తయారు చేసే ఈ రంగంలోని ఉద్యోగుల వేతనాలు రెండేళ్ల క్రితం వారి అనుభవానికి 3 రెట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వారి అనుభవానికి 4- 5 రెట్ల మేర వేతనాలు లభిస్తున్నాయి. 
♦ భారీ స్థాయిలో డేటా వస్తుండటంతో వినియోగదారులకు భద్రత, తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి నెట్‌వర్కింగ్‌ రంగంలో నవకల్పనలు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతికత మరింతగా పెరుగుతోంది. ఫలితంగా నెట్‌వర్కింగ్‌ రంగంలో ఉద్యోగాలు, నైపుణ్యాలకు డిమాండ్‌ పెరుగుతోంది. 
♦ సాఫ్ట్‌వేర్‌ రంగానికి వస్తే, డిజిటల్‌ టెక్నాలజీల కారణంగా వేతనాలు పెరుగుతున్నాయి. కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ విభాగాల్లో వేతనాలు బాగా పెరుగుతున్నాయి. ప్రోగ్రామింగ్‌ బాగా వచ్చి, ఇతర (బిజినెస్‌, ఫైనాన్స్‌, మెడికల్‌ తదితర ) రంగాల్లో విస్తృతమైన పరిజ్ఞానం ఉన్నవారికి కూడా మంచి వేతనాలు లభిస్తున్నాయి. 
♦ ఇంజినీరింగ్‌ డైరెక్టర్లు అధిక వేతనం పొందుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌(సేల్స్‌), సీనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్లు ఉన్నారు. You may be interested

రూ.90,000 కోట్లు తగ్గనున్న పరోక్ష పన్నుల ఆదాయం

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.90,000 కోట్ల మేర తగ్గిపోయే అవకాశాలున్నాయని ఎస్‌బీఐ ఎకోరాప్‌ సంస్థ అంచనా వేసింది. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపు, అలాగే జీఎస్టీ వసూళ్లు మందగించడం ఇందుకు కారణాలని తన పరిశోధన నివేదికలో తెలియజేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో జీఎస్టీ ద్వారా రూ.7.4 లక్షల కోట్లు, ఎక్సైజ్‌ డ్యూటీల రూపంలో రూ.2.6 లక్షల కోట్ల ఆదాయం రానుందని కేంద్రం

నిస్సాన్ చైర్మన్‌గా ఘోన్‌ తొలగింపు

Friday 23rd November 2018

టోక్యో: ఆర్థిక అవకతవకల ఆరోపణలపై అరెస్టయిన కార్లోస్‌ ఘోన్‌... ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. కంపెనీ బోర్డు ఆయన్ను తొలగించినట్లు జపాన్ మీడియాలో వార్తలు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా సారథ్యం వహిస్తున్న ఘోన్‌ను తప్పించాలని ఏడుగురు సభ్యుల నిస్సాన్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు జపాన్‌ ప్రభుత్వ ప్రసార సంస్థ ఎన్‌హెచ్‌కె, బిజినెస్ డెయిలీ నికాయ్‌ వెల్లడించాయి. అనేక సంవత్సరాలుగా ఆదాయాన్ని తక్కువగా చూపుతున్నారన్న

Most from this category