News


బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి

Saturday 1st September 2018
news_main1535780069.png-19863

న్యూఢిల్లీ: సెప్టెంబరు మొదటి వారంలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవులంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. వచ్చేవారంలో ఉన్నటువంటి సాధారణ సెలవులు మినహాంచి మిగిలిన రోజుల్లో బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయని వివరించింది. సెప్టెంబరు 2 (ఆదివారం), సెప్టెంబరు 8 (రెండవ శనివారం) మినహా సెలవులు లేవని స్పష్టత ఇచ్చింది. సెప్టెంబరు 3న కృష్ణాష్టమి పండుగ కాగా, ఆ రోజున దేశవ్యాప్త సెలవులేదని.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే సెలవు ఉంటుందని వివరించింది. సెలవు రోజుల్లో ఏటీఎంలు, ఆన్‌లైన్‌ లావాదేవీలలో ఎటువంటి అంతరాయం ఉండబోదని భరోసా ఇచ్చింది. వచ్చే వారం ఏటీఎంలలో తగినంత నగదును నిర్వహించాల్సిందిగా బ్యాంకులను సూచించినట్లు వెల్లడించిన ఆర్థిక శాఖ.. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటన ద్వారా వివరించింది.



You may be interested

భారత్‌ ‘వృద్ధి’ ఢంకా..!

Saturday 1st September 2018

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పిత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్‌- 2019 మార్చి) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ, దూసుకుపోయింది. ఏకంగా 8.2 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇది తొమ్మిది త్రైమాసికాల గరిష్టస్థాయి.  2016-17 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.1 శాతంగా నమోదయ్యింది.  అటు తర్వాత ఇంత స్థాయి వృద్ధి రేటును సాధించడం ఇదే తొలిసారి.

కీలక పోస్టుల్లో ఉన్న వారిని బదిలీ చేయాలి

Saturday 1st September 2018

న్యూఢిల్లీ: మోసాల నివారణకు గాను సున్నితమైన పోస్టుల్లో పనిచేస్తున్న వారిని తరచూ మారుస్తుండాలని బ్యాంకులు, బీమా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) ఆదేశించింది. ఇందుకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆదేశాలను గుర్తు చేస్తూ... ఈ విధంగా మార్చే పద్ధతిని అనుసరించకపోవడం మోసాలకు ఒకానొక కారణంగా సీవీసీ పేర్కొంది. ‘‘దీన్ని మరోసారి గుర్తు చేస్తున్నాం. మూడేళ్లకు మించి పనిచేస్తున్న అధికారులను సున్నితమైన పోస్టుల నుంచి

Most from this category