STOCKS

News


బ్యాంకులకు 5 రోజులు వరుస సెలవులు

Thursday 20th December 2018
news_main1545282884.png-23094

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వరుస సెలవులు, సమ్మెల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలు 5 రోజులు నిలిచిపోనున్నాయి. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీవోసీ) డిసెంబరు 21న సమ్మెకు పిలుపునిచ్చింది. డిసెంబరు 22 నాలుగో శనివారం, 23వ తేదీ ఆదివారం కావడంతో సాధారణంగా బ్యాంకులు పనిచేయవు. 24వ తేదీ (సోమవారం) బ్యాంకులు తెరుస్తారు. 25వ తేదీ క్రిస్మస్‌ సెలవు. డిసెంబరు 26న యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్‌ సమ్మెకు దిగుతోంది. ఈ లెక్కన 24వ తేదీ మినహాయిస్తే డిసెంబరు 21 (శుక్రవారం) నుంచి 26 (బుధవారం) వరకు బ్యాంకు సేవలు స్తంభించనున్నాయి. అన్ని స్థాయిల్లోనూ వేతన సవరణతోపాలు పలు డిమాండ్ల సాధన కోసం అసోసియేషన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. డిసెంబరు 21 సమ్మెలో దేశవ్యాప్తంగా 3.2 లక్షల మంది అధికారులు పాల్గొంటున్నారు. డిసెంబరు 26 సమ్మె ప్రభావం ఏటీఎం సేవలపై పడనుంది.



You may be interested

టాప్‌-5లో హైదరాబాద్‌:సెనైజర్‌

Thursday 20th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆడియో ఉపకరణాల తయారీలో ఉన్న జర్మనీ దిగ్గజం సెనైజర్‌ ఎలక్ట్రానిక్స్‌కు భారత్‌లో టాప్‌-5 మార్కెట్లలో హైదరాబాద్‌ ఒకటిగా నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ మార్కెట్‌ 25 శాతం వృద్ధి నమోదు చేసిందని కంపెనీ ప్రొఫెషనల్‌ విభాగం డైరెక్టర్‌ విపిన్‌ పుంగాలియా బుధవారం తెలిపారు. నూతన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దక్షిణాదిన తొలి స్థానం భాగ్యనగరిదేనని చెప్పారు. ‘సెనైజర్‌ అమ్మకాల్లో భారత మార్కెట్‌

ఐసీఐసీఐ ప్రూడెన్షియల్‌ నుంచి ఇండియా అపార్చునిటీస్‌ ఫండ్‌

Thursday 20th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఐసీఐసీఐ ప్రూడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తాజాగా ఇండియా అపార్చునిటీస్‌ ఫండ్‌ పేరుతో ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌ డిసెంబరు 26తో ప్రారంభమై జనవరి 9తో ముగియనుంది. ప్రత్యేక సందర్భాల్లో.. అంటే షేర్‌ ధర పడిపోయినప్పుడే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ఈ ఫండ్‌ ప్రత్యేకత అని కంపెనీ సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ యోగేష్‌ భట్‌ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘గ్రోత్‌, డివిడెండ్‌ ఆప్షన్స్‌లో ఇది

Most from this category