STOCKS

News


ఐబీసీ ద్వారా బ్యాంకులకు రూ.80,000 కోట్లు

Thursday 9th May 2019
news_main1557383404.png-25637

  • 2019-20 ఆర్థిక సంవత్సరంపై ఇక్రా అంచనా

న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద మొండి బకాయిలకు పరిష్కారం రూపేణా రూ.80,000 కోట్లు వసూలవుతాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇలా వసూలైన మొత్తం రూ.66,000 కోట్లతో పోలిస్తే పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు పెద్ద ఖాతాలైన ఎస్సార్‌ స్టీల్‌, భూషణ్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌కు కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) పూర్తవుతుందన్న అంచనాతో ఇక్రా అధిక అంచనాలను వ్యక్తం చేసింది. 2017 జూన్‌లో ఆర్‌బీఐ పేర్కొన్న 12 అతిపెద్ద కార్పొరేట్‌ రుణ ఎగవేత ఖాతాల్లో ఈ రెండూ ఉన్నాయి. ‘‘వీటికి కూడా పరిష్కారం పూర్తయితే ఆర్‌బీఐ జాబితాలోని 12కు గాను 8 ఖాతాల విషయంలో ప్రక్రియ ముగిసినట్టు అవుతుంది. పరిష్కార ప్రక్రియలో చాలా జాప్యం నెలకొని, 500 రోజులకుపైగా సమయం తీసుకున్నప్పటికీ ఐబీసీ పట్ల విశ్వాసం పెరిగేందుకు సాయపడుతుంది. ఐబీసీ సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, ఎన్‌సీఎల్‌టీ ముందు దాఖలయ్యే కేసుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తు‍న్నాం. ముఖ్యంగా అన్ని కేసుల్లోనూ 50 శాతం ఎక్స్‌పోజర్‌ ఉన్న ఆపరేషనల్‌ క్రెడిటార్ల నుంచి కేసుల దాఖలు ఉంటుంది’’ అని ఇక్రా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఐబీసీ కింద పరిష్కరించిన కేసుల్లో ఎలక్ట్రోస్టీల్‌, మోనెత్‌ ఇస్పాత్‌, ఆమ్టెక్‌ ఆటో ఉన్నాయి. 2019 మార్చి నాటికి ఐబీసీ కింద 715 కార్పొరేట్‌ రుణ ఎగవేత కేసులు ముగియగా, వీటిల్లో 378 కేసులు లిక్విడేషన్‌కు వెళ్లాయని, 92 వాటికి పరిష్కారం లభించిందని ఇక్రా తెలిపింది. You may be interested

2నెలల కనిష్టానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Thursday 9th May 2019

ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు గురువారం ట్రేడింగ్‌లో 3శాతం నష్టపోయింది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం షేరు పతనానికి కారణమైంది. రానున్న రెండేళ్ల కాలంలో రిలయన్స్‌ కంపెనీ ఆదాయాలు పరిమితం కావడంతో పాటు కీలకమైన ఇంధన వ్యాపారంలో ఎదురవనున్న సమస్యలు దృష్ట్యా షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. అలాగే కంపెనీకి పెరుగుతున్న రుణభారం, స్థూల రీఫైనరీ మార్జిన్లు

జూలై నాటికి రూ.12,000 కోట్లకు పరిష్కారం

Thursday 9th May 2019

జూలై నాటికి రూ.12,000 కోట్లకు పరిష్కారం ‘ఐఎల్‌ఎఫ్‌ఎస్‌’ రుణాలపై కేంద్రం వివరణ న్యూఢిల్లీ: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపులో ఆర్థికంగా సానుకూలంగా ఉన్న 55 కంపెనీలకు (గ్రీన్‌ కంపెనీలు) సంబంధించి 12,000 కోట్ల మేర రుణాలకు జూలై నాటికి పరిష్కారం లభించనుంది. పరిష్కార ప్రక్రియ సజావుగానే కొనసాగుతున్నట్టు కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ తెలియజేశారు. చాలా వరకు గ్రీన్‌ కంపెనీలు సానుకూల ఈక్విటీతో ఉన్నాయన్నారు. అంటే రుణాలు చెల్లించాక కూడా వాటాదారులకు ఎంతో కొంత

Most from this category