STOCKS

News


రూ.1.80లక్షల కోట్లు దాటనున్న మెండిబకాయిల రీకవరీ

Monday 29th October 2018
news_main1540789213.png-21548

  • ఆర్థిక శాఖ అంచనా

న్యూఢిల్లీ: కొత్త దివాలా చట్టం (ఐబీసీ) ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.80 లక్షల కోట్ల పైగా మొండిబాకీల (ఎన్‌పీఏ) రికవరీ కాగలదని కేంద్రం అంచనా వేస్తోంది. ఇప్పటికే కొన్ని పెద్ద ఖాతాల పరిష్కార ప్రక్రియ కొనసాగుతుండగా, మరికొన్ని ఖాతాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వేలానికి వచ్చిన ఎస్సార్ స్టీల్‌, భూషణ్ పవర్ అండ్ స్టీల్‌ వంటి కేసులను ఉటంకిస్తూ ఇదే తీరు కొనసాగితే తాము నిర్దేశించుకున్న రూ. 1.80 లక్షల కోట్ల మొండిబాకీల రికవరీ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2017-18లో బ్యాంకులు రూ. 74,562 కోట్లు రాబట్టుకోగలిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ. 36,551 కోట్లు రికవర్ చేసుకున్నాయి.
    రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించిన 12 భారీ మొండిబాకీ కేసుల పరిష్కారం ద్వారా కనీసం రూ. 1 లక్ష కోట్ల పైగా రాగలవని బ్యాంకులు ఆశిస్తున్నాయి. ఆర్‌బీఐ రూపొందించిన భారీ ఎన్‌పీఏల్లోని ఎస్సార్ స్టీల్‌, భూషణ్ పవర్ అండ్ స్టీల్ పరిష్కార ప్రక్రియ ప్రస్తుతం తుది దశల్లో ఉంది. బినానీ సిమెంట్‌, జేపీ ఇన్‌ఫ్రాటెక్ పరిష్కార ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఎస్సార్ స్టీల్‌కి ఇచ్చిన సుమారు రూ. 49,000 కోట్ల రుణాల్లో దాదాపు 86 శాతం మొత్తాన్ని రాబట్టుకోవచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి. ఈ సంస్థ కొనుగోలు కోసం ఆర్సెలర్‌మిట్టల్ సంస్థ .. కొత్త పెట్టుబడులు సహా రూ. 50,000 కోట్లు ఆఫర్ చేసింది. అటు భూషణ్ పవర్ అండ్‌ స్టీల్‌కు రూ. 11,000 కోట్ల నుంచి రూ. 19,700 కోట్ల దాకా బిడ్లు వచ్చాయి.



You may be interested

సబ్సీడీ నగదు బదిలీకి ఆధార్‌ ఈ-కేవైసీ వాడొచ్చు

Monday 29th October 2018

బ్యాంకులకు యూఐడీఏఐ స్పష్టత న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలకు సంబంధించి నగదు బదిలీ (డీబీటీ) లబ్ధిదారుల ధృవీకరణ కోసం బ్యాంకులు ఆధార్ ఈ-కేవైసీని ఉపయోగించవచ్చని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికరణ సంస్థ యూఐడీఏఐ స్పష్టతనిచ్చింది. ఒకవేళ ఖాతాదారు స్వచ్ఛందంగా అనుమతి ఇచ్చిన పక్షంలో వారి ధృవీకరణకు ఆఫ్‌లైన్‌లో పేపరు రూపంలోని ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ధృవీకరణ కోసం ఆధార్‌ను ఏయే సందర్భాల్లో, ఏయే రూపాల్లో ఉపయోగించవచ్చో బ్యాంకులకు

ఫలితాలు గణాంకాలపై దృష్టి

Monday 29th October 2018

- ఈవారంలోనే కీలక గణాంకాల వెల్లడి - బుధవారం.. సెప్టెంబర్‌ ద్రవ్యలోటు, ఇన్‌ఫ్రా అవుట్‌పుట్‌ డేటా - గురువారం... నికాయ్‌ తయారీ రంగ పీఎంఐ, ఆటో రంగ అమ్మకాల గణాంకాలు - శుక్రవారం అమెరికా నిరుద్యోగ గణాంకాలు - 796 బీఎస్‌ఈ కంపెనీల క్యూ2 ఫలితాలు ఈవారంలోనే - రూపాయి కదలికలు కీలకం..! ముంబై: స్థూల ఆర్థిక సమాచారం, కొనసాగుతున్న జూలై–సెప్టెంబర్‌ (క్యూ2) ఆర్థిక ఫలితాల వెల్లడి ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని దలాల్‌

Most from this category