STOCKS

News


నేడు బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

Wednesday 26th December 2018
news_main1545799260.png-23235

న్యూఢిల్లీ: విజయాబ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నాయి. గత శుక్రవారం కూడా ఇదే అంశంతోపాటు వేతన డిమాండ్లపై ఒక రోజు సమ్మె చేసిన బ్యాంకు ఉద్యోగులు వారం తిరగక ముందే మరోసారి సమ్మెకు దిగుతున్నారు. దీంతో బుధవారం ప్రభుత్వరంగ బ్యాంకు సేవలపై ప్రభావం పడనుంది. ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. చాలా వరకు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమ్మె విషయమై సమాచారాన్ని కూడా తెలియజేశాయి. తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యునైటెడ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఈ సమ్మెను నిర్వహిస్తోంది. విలీనం విషయంలో ముందుకు వెళ్లబోమంటూ ప్రభుత్వం నుంచి తమకు హామీ రాలేదని, దాంతో సమ్మె నిర్ణయం తీసుకున్నామని ఆల్‌ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం తెలియజేశారు. ప్రభుత్వం బ్యాంకుల సైజు పెరగాలని కోరుకుంటోందని, ప్రభుత్వరంగ బ్యాంకులు అన్నింటినీ కలిపి ఒక్కటి చేసినా గానీ, ప్రపంచంలోని టాప్‌ 10లో చోటు దక్కదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. 



You may be interested

రైడ్.. రఫ్ & టఫ్!

Wednesday 26th December 2018

బహుశా! 2018వ సంవత్సరాన్ని ఇన్వెస్టర్లెవరూ మరిచిపోలేరేమో!! ఎందుకంటే ఈ ఏడాది వచ్చినన్ని ఒడిదుడుకులు గతంలో ఎన్నడూ రాలేదు. ఈ ఏడాదిలో ఒకదశలో మార్కెట్లు జీవితకాల గరిష్ఠ స్థాయిలకు వెళ్లాయి. భారీ లాభాలనిచ్చాయని అనుకున్నారంతా!. కానీ ఏడాది చివరికి వచ్చేసరికి పరిస్థితి తల్లకిందులైంది. ఈ ఏడాది వచ్చిన లాభాలన్నీ హరించుకుపోయాయి. మన దేశంలోనే కాదు. అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి. అలా చూసినపుడు కొంతలో కొంత మన మార్కెట్లే నయం. కొన్ని అంతర్జాతీయ

8 వరకూ ఒలెక్ట్రా ఓపెన్‌ ఆఫర్‌!

Wednesday 26th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్‌ల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ (గతంలో గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌) ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌ అమల్లోకి వచ్చింది. ఈ ఆఫర్‌ జనవరి 8న ముగుస్తుంది. ఒలెక్ట్రాలో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం ప్రమోటింగ్‌ కంపెనీలైన ఎంఈఐఎల్‌ హోల్డింగ్స్‌తో పాటు మేఘా ఇంజనీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు కంపెనీలో మరో 26 శాతం వాటాను షేర్‌ హోల్డర్ల నుంచి ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చి కొనుగోలు

Most from this category