STOCKS

News


బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 13.49 శాతం అప్‌!

Thursday 13th September 2018
news_main1536814446.png-20226

ముంబై: బ్యాంకింగ్‌ రుణ వృద్ధి  2018 ఆగస్టు 31వ తేదీతో ముగిసిన పక్షంలో వార్షికంగా 13.49 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. విలువ రూపంలో చూస్తే ఈ మొత్తం రూ.87,89,259 కోట్లు. గత ఏడాది ఇదే పక్షం రోజులకు బ్యాంకింగ్‌ రుణం రూ.77,44,237 కోట్లు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
♦ ఆగస్టు 17తో ముగిసిన పక్షం రోజుల్లో వార్షికంగా రుణ వృద్ధి శాతం 12.94. విలువ రూపంలో రూ.86,75,129 కోట్లు. అంటే వరుసగా పక్షం రోజుల పరిధిని చూసినా రుణ పరిమాణం పెరిగింది. 
♦ ఇక డిపాజిట్ల విషయానికి వస్తే, 2018 ఆగస్టు 31తో ముగిసిన పక్షం రోజుల్లో బ్యాంకింగ్‌ డిపాజిట్లు 8.9 శాతం పెరిగాయి. విలువ రూపంలో రూ.106,96,099 కోట్ల నుంచి రూ. 116,45,870 కోట్లకు ఎగశాయి. కాగా ఆగస్టు 18తో ముగిసిన పక్షం రోజుల్లో డిపాజిట్లు 8.31 శాతం వృద్ధితో రూ. 106,28,428 కోట్లుగా ఉన్నాయి. 
♦ నాన్‌-ఫుడ్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ 2018 జూలై నాటికి 10.6 శాతం పెరిగింది. 2017 జూలైలో ఈ వృద్ధి రేటు కేవలం 5.3 శాతమే. 
♦ వ్యవసాయం,  అనుబంధ రంగాలకు సంబంధించి రుణాలు జూలైలో 6.6. శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. 
♦ జూలైలో సేవల రంగానికి రుణాలు గణనీయంగా 23 శాతం పెరిగాయి. 2017 జూలైలో ఈ పెరుగుదల రేటు 4.9 శాతమే. 
♦ వ్యక్తిగత రుణాలు ఇదే కాలంలో 15 శాతం నుంచి 16.7 శాతానికి పెరిగాయి. 



You may be interested

ఆర్థిక రంగంపై ఎల్లుండి  ప్రధాని సమీక్ష!

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగంపై ప్రధాని మోదీ శనివారం సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. వేగంగా పడిపోతున్న రూపాయికి కళ్లెం వేసే విషయంలో అవసరమైన చర్యలపైనా చర్చించే అవకాశాలున్నాయని తెలిపాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌, ప్రధాని ఆర్థిక సలహా మండి చైర్మన్‌ బిబేక్‌ దేబ్రాయ్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా తదితరులు

పరిశ్రమల పురోగతి - ధరల తగ్గుదల

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: జూలై, ఆగస్టులో సానుకూలమైన స్థూల ఆర్థిక గణాంకాలు నమోదయ్యాయి. జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 6.6 శాతంగా నమోదయ్యింది. ఇక ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.69 శాతంగా నమోదయ్యింది. 11 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో ఆర్‌బీఐ రెపో రేటును పెంచకపోవచ్చన్న అంచనాలున్నాయి. అక్టోబర్‌ 5న పాలసీ సమీక్ష

Most from this category