STOCKS

News


సానుకూల బ్యాంకింగ్‌ రుణ వృద్ధి

Saturday 27th October 2018
news_main1540610944.png-21522

ముంబై: బ్యాంకింగ్‌ రుణ వృద్ధి  2018 అక్టోబర్‌ 12వ తేదీతో ముగిసిన పక్షం రోజుల కాలానికి గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే, 14.35 శాతం పెరిగింది. రూ.89.93 లక్షల కోట్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకింగ్‌ రుణాలు రూ.78.65 లక్షల కోట్లు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- 

♦ తాజా సమీక్షా కాలంలో డిపాజిట్ల వృద్ధి రేటు 8.86 శాతం పెరిగింది. విలువ రూపంలో 108.25 లక్షల కోట్ల నుంచి రూ.117.85 లక్షల కోట్లకు చేరింది. 
♦ సెప్టెంబర్‌ 28వ తేదీతో ముగిసిన పక్షం రోజులనుచూస్తే, (2017 ఇదే కాలంతో పోల్చి) రుణ వృద్ధి 12.51 శాతం పెరిగి, రూ.89.82 లక్షల కోట్లకు చేరింది. కాగా డిపాజిట్లలో రేటు 8.07 శాతం పెరుగుదలతో రూ.117.99 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 

ఒక్క ఆగస్టు చూస్తే...
♦ మరోవైపు 2018 ఆగస్టులో ఆహార విభాగానికి రుణంలో 12.4 శాతం వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 5.5 శాతమే. 
♦ ఇక ఇదే నెలలో పారిశ్రామిక రంగానికి రుణాల్లో వృద్ధి 0.3 శాతం నుంచి 1.9 శాతానికి చేరింది. 
♦ వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు సంబంధించి రుణం 6.5 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది. 
♦ సేవల రంగానికి రుణం 5 శాతం నుంచి భారీగా 26.7 శాతానికి చేరింది. 
♦ వ్యక్తిగత రుణాలు 15.7 శాతం నుంచి 18.2 శాతానికి పెరిగాయి. 



You may be interested

జెట్‌ ఎయిర్‌వేస్‌లో పింక్‌ స్లిప్స్‌

Saturday 27th October 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్.. తాజాగా 20 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్స్‌ జారీ చేసినట్లు వెల్లడైంది. వీరిలో పలువురు సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌ స్థాయి వారు ఉన్నట్లు సమాచారం. వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్‌, సెక్యూరిటీ, సేల్స్‌ విభాగాలకు చెందిన ఉన్నత స్థాయి ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్లు వెల్లడైంది.

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.487 కోట్లు

Saturday 27th October 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌కు (ఐఓబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.487 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో, ఈ క్యూ1లో వచ్చిన నష్టాలను పరిగణనలోకి తీసుకున్నా, ఈ బ్యాంక్‌ నష్టాలు బాగా తగ్గాయి. గత క్యూ2లో ఈ బ్యాంక్‌కు రూ.1,223 కోట్లు, ఈ క్యూ1లో రూ.919 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొండి బకాయిలు, ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం కేటాయింపుల కారణంగానే నికర

Most from this category