STOCKS

News


అమెరికా షట్‌డౌన్‌కు తాత్కలిక ముగింపు

Saturday 26th January 2019
news_main1548498489.png-23824

అమెరికా చరిత్రలోనే సుదీర్ఘకాలం పాటు కొనసాగుతున్న ప్రభుత్వ ‘షట్‌డౌన్‌’కు శుక్రవారం తాత్కలిక ముగింపు పడింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ కార్యకలాపాలను తాత్కలికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 35 రోజుల పాటు సాగిన ప్రభుత్వ ‘షట్‌డౌన్‌’పై అటు పార్టీ, ప్రభుత్వ, దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్రంప్‌ 3వారాల వరకు ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతాయని తాజాగా వెల్లడించారు. వచ్చే నెల 15వరకు ప్రభుత్వ కార్యక్రమాలకు అవసరమైన నిధులను విడుదల చేస్తున్నట్లు ట్రంప్‌ ఆదేశాలను జారీ చేశారు. ఫలితంగా గత 35 రోజులుగా జీతాలు లేకున్నా అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న 8లక్షల మంది సిబ్బందికి ఉపశమనం కలగనుంది.

అమెరికాలోకి అక్రమ వలసలను నిర్మూలించే విధానంలో భాగంగా అమెరికా-మెక్సికో సరిహద్దులో 5.7 బిలియన్‌ డాలర్ల భారీ వ్యయంలో గోడను నిర్మించేందుకు పూనుకున్నారు. అందుకు కావాల్సిన నిధులను విడుదల చేసేందుకు కాంగ్రెస్‌లో ద్రవ్య వినియయ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే గోడ నిర్మాణాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష డెమోక్రాట్లు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు వీగిపోయింది.  దీంతో ట్రంప్‌ డిసెంబర్‌ 22 నుంచి పాక్షికంగా ప్రభుత్వ మూసివేతకు చర్యలు చేపట్టారు.  
 

వెనక్కి తగ్గది లేదు:-
అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం విషయంలో వెనక్కి తగ్గేది లేదని ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశారు. డెమోక్రట్లు గోడ నిర్మాణానికి ఆమోదం తెలపకపోతే షట్ డౌన్ ను తిరిగి విధిస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఆమోదం తెలుపని పక్షంలో అత్యవసర పరిస్థితి విధించైనా నిధుల సమకూర్చుకుంటామని ట్రంప్‌ వెల్లడించారు.



You may be interested

జనవరి 29న చాలెట్‌ హోటల్స్‌ ఐపీఓ

Saturday 26th January 2019

కే.రహేజా గ్రూప్‌కు చెందిన చాలెట్‌ హోటల్స్‌ ఐపీఓ జనవరి 29న ప్రారంభం కానుంది. ఇదే నెల 30న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.1640 కోట్లు సమీకరించాలన్నది యోచన. ఐపీఓ ధర శ్రేణి రూ.275- రూ.280గా ఉంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 950 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ప్రమోటర్‌ గ్రూప్‌  రూ.609 కోట్ల విలువైన 2.46 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇష్యూ కోసం కనీసం 53 షేర్ల(ఒక

మై జీనియస్‌ స్టార్‌లో నైపుణ్య శిక్షణ

Saturday 26th January 2019

- రూబిక్స్, అబాకస్, డ్రాయింగ్, హ్యాండ్‌ రైటింగ్‌ ట్రెయినింగ్‌ - ఫిబ్రవరిలో మార్కెట్లోకి యాప్‌; రూ.3 కోట్ల ఆదాయం లక్ష్యం - హైదరాబాద్, బెంగళూరులోని వందకు పైగా స్కూళ్లతో ఒప్పందం -  ‘స్టార్టప్‌ డైరీ’తో కంపెనీ ఫౌండర్‌ చవ్యా శివ నవ్య హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అబాకస్, క్యూబ్స్, ప్రొగ్రామింగ్‌ వంటి సాఫ్ట్‌ స్కిల్స్‌ నేర్చుకోవాలంటే? ప్రత్యేకంగా శిక్షణ కేంద్రానికెళ్లాలి లేదా హోమ్‌ ట్రెయినర్‌ను పెట్టుకోవాలి. కాకపోతే ఇలాంటివి మెట్రోల్లోనే దొరుకుతాయి. మరి, ద్వితీయ, తృతీయ

Most from this category