STOCKS

News


బ్యాక్ ఆఫీస్ సేవలపై పన్నులతో వివాదాలు: నాస్కామ్‌

Tuesday 20th November 2018
news_main1542685514.png-22211

న్యూఢిల్లీ: బహుళ జాతి కంపెనీలకు అందించే బ్యాక్ ఆఫీస్, సపోర్ట్ సేవలకు కూడా జీఎస్‌టీ వర్తిస్తుందంటూ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్‌) ఇచ్చిన ఉత్తర్వులతో అనవసర వివాదాలు తలెత్తే అవకాశం ఉందని సాఫ్ట్‌వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ అభిప్రాయపడింది. దీనివల్ల అనేక ఉద్యోగాల్లో కోత పడటంతో పాటు అంతర్జాతీయ సర్వీస్ ప్రొవైడర్‌గా భారత ప్రతిష్ట మసకబారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాక్ ఆఫీస్‌ సర్వీసులను ఎగుమతులుగా పరిగణించరాదని, 18 శాతం జీఎస్‌టీ పన్ను రేటు వర్తిస్తుందని వీసర్వ్ గ్లోబల్ కేసులో ఏఏఆర్‌ మహారాష్ట్ర బెంచ్‌ ఇటీవల ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు ఊతంతో రెట్రాస్పెక్టివ్ ప్రాతిపదికన (గత కాలంలో జరిగిన లావాదేవీలపై కూడా) పన్నుల శాఖ ట్యాక్స్‌ డిమాండ్ చేసే అవకాశం ఉందని, ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో దేశీ సంస్థలు పోటీపడలేని పరిస్థితి నెలకొంటుందని నాస్కామ్ పేర్కొంది. 



You may be interested

విమాన బోర్డింగ్‌లో మార్పులు!

Tuesday 20th November 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: త్వరలోనే విమానాల్లో బోర్డింగ్‌ పద్ధతి మారనుంది. ఇప్పటివరకు విమానాల్లో బోర్డింగ్‌ సీట్‌ నంబర్ల ఆధారంగా వరుస క్రమంలో ఉండేది. కానీ, మున్ముందు దీని స్థానంలో విమానంలో కిటికీ దగ్గర సీటు ప్రయాణికులు ముందు, ఆ తర్వాత మధ్య సీటు వారు, ఆ తర్వాత చివరి సీటు ప్రయాణికులు ఎక్కే విధంగా చర్యలు తీసుకోనున్నారు. ఈ విధానంలో విమానాల బోర్డింగ్‌ సమయం 35 శాతం వరకు తగ్గుతుందనేది

మార్కెట్లోకి ఒన్‌ప్లస్‌6టీ

Tuesday 20th November 2018

అంతర్జాతీయ మొబైల్‌ టెక్నాలజీ కంపెనీ- ఒన్‌ప్లస్‌ తన తాజా ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌ డిజైన్‌ ఒన్‌ప్లస్‌ 6టీని మూడు వేరియంట్లలో  ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.37,999 (6/128జీబీ). 8/128జీబీ ధర రూ.41,999గా, 8/256 జీబీ ధర రూ.45,999గా ఉన్నాయి. 6.41 అంగుళాల ఆప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేపై అత్యంత వేగవంతమైన ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ టెక్నాలజీ స్రీన్‌ అన్‌లాక్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకత. ఇవి అమెజాన్‌, ఒన్‌ప్లస్‌ వెబ్‌సైట్లతో పాటు క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌,

Most from this category