News


జీఎస్టీలోకి త్వరలోనే ఎటీఎఫ్‌, సహజవాయువు!

Friday 23rd November 2018
news_main1542997428.png-22353

జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులైన సహజవాయువు, విమనయాన ఇంధనం (ఏటీఎఫ్‌)ను తీసుకొచ్చే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్‌ పరిశీలించనుంది. పెట్రోలియం ఉత్పత్తుల్లో ఏటీఎఫ్‌, సహజవాయువును జీఎస్టీలోకి తీసుకురావడం సులభమేనని ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి తెలిపారు. జీఎస్టీ తదుపరి భేటీ ఎప్పుడన్నది ఇంకా ఖరారు కాలేదని, డిసెంబర్‌ నెల మధ్యలో ఉండొచ్చని చెప్పారు. ఈ రెండింటిపై పన్ను రేటు ఏదన్నది కూడా ఇంకా ఖరారు కాలేదన్నారు. వాస్తవానికి ఈ ఏడాది జూలైలోనే జీఎస్టీ కౌన్సిల్‌ ఈ రెండింటినీ జీఎస్టీ పరిధిలోకి చేరికపై నిర్ణయం తీసుకుంటుందని భావించారు. కానీ, కౌన్సిల్‌ అజెండా నుంచి ఈ అంశాన్ని తీసేయడం గమనార్హం.


 
ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌, క్రూడాయిల్‌, సహజవాయువు, ఏటీఎఫ్‌లు జీఎస్టీకి వెలుపల ఉన్నాయి. దీంతో జీఎస్టీకి ముందు మాదిరిగానే వీటిపై కేంద్రం, రాష్ట్రాలు పన్నులు పిండుకుంటున్నాయి. కేంద్రం ఎక్సైజ్‌ సుంకం విధిస్తుంటే, రాష్ట్రాలు వ్యాట్‌ వేస్తున్నాయి. ఈ పన్నుల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుండడంతో జీఎస్టీలోకి చేర్చే విషయమై దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రం కూడా అనుకూలంగా లేవు. అందుకే జీఎస్టీలోకి చేర్చడం సాధ్యం కావడం లేదు. అయితే, వీటిల్లో ఏటీఎఫ్‌, సహజవాయువులను జీఎస్టీ నుంచి మినహాయించడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుందని, వీటి అమ్మకాలపై ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ జమ కావడం లేదన్నది అధికార వర్గాల వాదన. చమురు ధరలు పెరుగుతుండంతో ఏటీఎఫ్‌ను జీఎస్టీలోకి చేర్చాలని పౌర విమానయాన శాఖ సైతం కోరుతోంది. ఇక సహజవాయవును ఎరువులు, స్టీల్‌, రసాయనాలు, సిమెంట్‌ తదితర ఎన్నో పరిశ్రమలు వినియోగిస్తున్నాయి. పన్ను జమకు అవకాశం లేకపోవడం అన్నది జీఎస్టీ ఉద్దేశ్యానికి వ్యతిరేకంగా ఉందని పరిశ్రమల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. 
 



You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌ నచ్చింది వీటినే

Saturday 24th November 2018

దేశీయ మార్కెట్లలో కరెక్షన్‌ను మ్యూచువల్‌ ఫండ్స్‌ ఓ మంచి అవకాశంగా తీసుకున్నాయి. తక్కువ ధరల వద్ద అందుబాటులో ఉన్న బలమైన కంపెనీల షేర్లను అక్టోబర్‌లో కొనుగోలు చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ, రిలయన్స్‌ నిప్పన్‌ ఏఎంసీలు కలసి కోల్‌ ఇండియాలో 7.67 కోట్ల షేర్లను కొనుగోలు చేశాయి. సెప్టెంబర్‌ త్రైమాసికంలో కోల్‌ ఇండియా నికర లాభం ఎనిమిది రెట్లు పెరిగి రూ.3,085 కోట్లకు చేరిన విషయం విదితమే.

కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్చన్‌ లిమిటెడ్‌ షేరును అమ్మేయండి: జియోజిత్‌

Friday 23rd November 2018

ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడంతో కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ షేరును వదిలించుకోవాలని రేటింగ్‌ సంస్థ జియోజిత్‌ సూచిస్తుంది. మౌలికసదుపాయల  నిర్మాణ రంగలో సేవలు అందిస్తున్న కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ షేరుపై జియోజిత్‌ విశ్లేషణలు ఇలా ఉన్నాయి. కేఎన్‌ఆర్‌ సంస్థ:- జాతీయ, అంతర్జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్ట్‌ వ్యాపారాలపై దృష్టి ఎక్కువగా పెడుతోంది. ఇప్పుటి వరకు 12 రాష్ట్రాల్లో రూ.6000 కోట్ల రోడ్ల నిర్మాణాలను విజయవంతంగా పూర్తిచేసింది. 1    ఆర్డర్లు దక్కకపోవడంతో పాటు, హెచ్‌ఏఎం ప్రాజెక్ట్స్‌లో నష్టాల

Most from this category