STOCKS

News


జూన్‌లో ఏఐఎం నుంచి కొత్త స్కీమ్‌

Saturday 10th November 2018
news_main1541829403.png-21855

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గ్రామీణ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (ఏఐఎం) వచ్చే జూన్‌ నుంచి మరొక సరికొత్త పథకంతో రానుంది. దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎస్‌ఎంఈ), స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు లఘు వ్యాపార ఆవిష్కరణలు (స్మాల్‌ బిజినెస్‌ ఇన్నోవేషన్‌) పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నీతి ఆయోగ్‌ అడిషనల్‌ సెక్రటరీ, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌ రామనన్‌ రామనాథన్‌ తెలిపారు. ‘ది థింగ్స్‌ కాన్ఫరెన్స్‌ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సదస్సు అనంతరం ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
– లఘు వ్యాపార పరిశ్రమల పథకం కింద స్థానిక సమస్యలను పరిష్కరించే నూతన ఆవిష్కరణలు చేసే ఎంఎస్‌ఎంఈ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాంకేతికత, మౌలిక సదుపాయాలతో పాటూ నిధుల సహాయం కూడా అందిస్తాం. తొలిదశలో 500 కంటే తక్కువ ఉద్యోగులున్న ఎంఎస్‌ఎంఈలకు మాత్రమే అవకాశముంటుందని.. దిగుమతి ఉత్పత్తులను తగ్గించడంతో పాటూ మేకిన్‌ ఇండియాను ప్రమోట్‌ చేయడమే ఏఐఎం లక్ష్యం.
పాఠశాలల్లో థికరింగ్‌ ల్యాబ్స్‌..
ప్రస్తుతం ఏఎంఐలో థింకరింగ్‌ ల్యాబ్స్, ఇంక్యుబేషన్‌ సెంటర్స్‌ పేరిట ఇన్నోవేషన్‌ ప్రోగ్సామ్‌ ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు థింకరింగ్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ల్యాబ్స్‌ ఏర్పాటుకు కేంద్రం ఐదేళ్లలో రూ.20 లక్షల నిధులను సమకూరుస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,441 ల్యాబ్స్‌ మంజూరు కాగా వీటిల్లో సుమారు 2 వేల ల్యాబ్స్‌ నిర్వహణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 433, తెలంగాణలో 239 థింకరింగ్‌ ల్యాబ్స్‌ ఉంటాయి.
– ల్యాబ్స్‌ ఏర్పాటుకు పాఠశాల విస్తీర్ణం కనీసం 1,500 చ.అ.లతో పాటూ ఇంటర్నెట్‌ సదుపాయం, మెరుగైన మౌలిక వసతులు, కనీసం 400 మంది విద్యార్థులుండాలి. థింకరింగ్‌ ల్యాబ్స్‌లో విద్యార్థుల్లో త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఉత్పత్తులు, ఆగ్యుమేటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) సాంకేతికతలను శిక్షణతో పాటూ ఆయా టెక్నాలజీలతో స్థానిక సమస్యను పరిష్కరించే అన్వేషణలుంటాయి.
ఏడాదిలో 5 వేల ఇంక్యుబేషన్‌ సెంటర్ల లక్ష్యం..
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్‌లను ప్రోత్సహించేందుకు విశ్వ విద్యాలయాల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 101 ఇంక్యుబేషన్‌ సెంటర్లు మంజూరు కాగా.. 30 సెంటర్లు నిర్వహణలో ఉన్నాయి. ప్రతి ఇంక్యుబేషన్‌కు రూ.10 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నాం. ఒక్కో సెంటర్‌లో 30 స్టార్టప్స్‌ కార్యకలాపాలు సాగిస్తుంటాయి. నిధుల సహాయంతో పాటూ టెక్నాలజీ, ఇన్‌ఫ్రా, ల్యాబ్, వెంచర్‌ క్యాపలిస్ట్‌లు, మెంటార్స్‌ సపోర్ట్‌ కూడా ఉంటుంది. వచ్చే ఏడాది నాటికి 100 ఇంక్యుబేషన్‌ సెంటర్లలో 5 వేల స్టార్టప్స్‌ ఉండాలన్నది ఏఐఎం లక్ష్యం.
– తెలుగు రాష్ట్రాల్లో 13 ఇంక్యుబేషన్‌ సెంటర్లున్నాయి. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్, ఐఎస్‌బీ, టీ–హబ్‌. విశాఖపట్నంలల్లో ఉన్నాయి. వ్యవసాయ రంగ వృద్ధి, తీర ప్రాంతాల ఆదాయ వనరుల వృద్ధికి ఆయా స్టార్టప్స్‌ పనిచేస్తున్నాయి. ఇంక్యుబేషన్‌ ఏర్పాటుకు యూనివర్సిటీ విస్తీర్ణం కనీసం 10 వేల చ.అ. ఉండాలి.
––––––
ది థింగ్స్‌ కాన్ఫరెన్స్‌ ప్రారంభం..
సైబర్‌ ఐ, ఐబీ హబ్స్‌ ఆధ్వర్యంలో లోరావన్, ఐఓటీ టెక్నాలజీ అవకాశాలు, స్మార్ట్‌ సిటీల అభివృద్ధి, నిర్వహణ వ్యయాల తగ్గింపు తదితర అంశాలపై చర్చించే ‘ది థింగ్స్‌ కాన్ఫరెన్స్‌’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. యూరప్‌ వెలువల ఆసియాలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు హైదరాబాద్‌ వేదికైంది. రెండు రోజలు ఈ సదస్సులో టెక్నాలజీ నిపుణులు, కంపెనీ సీఈవోలు, స్పీకర్లు తదితరులు పాల్గొన్నారు. ‘‘చైనా, యూరప్‌ దేశాలు లోరావాన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నాయని.. దీంతో నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని సైబర్‌ ఐ సీఈఓ రామ్‌ గణేష్‌ తెలిపారు. తెలంగాణలోనూ లోరావాన్‌ టెక్నాలజీ అభివృద్ధి, నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని.. ప్రస్తుతం టెక్నాలజీ టెస్టింగ్‌ పైలెట్‌ ప్రాజెక్ట్‌ జరుగుతుందని.. త్వరలోనే అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్, ది థింగ్స్‌ ఇండస్ట్రీస్‌ సీఈఓ అండ్‌ కో–ఫౌండర్‌ వింకీ గిజీమాన్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
 You may be interested

1500 శాఖలు మూతపడ్డాయ్‌!

Saturday 10th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం అటు కస్టమర్లు, ఇటు బ్యాంకు ఉద్యోగులకు చేటు చేస్తుందని ఆల్‌ఇండియా స్టేట్‌బ్యాంక్‌ ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ జీ. సుబ్రమణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. విలీనాలతో కస్టమర్లకు అందించే సేవలపై, బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల జీవితాలపై పెను ప్రభావం పడుతుందన్నారు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేయడంతో దేశవ్యాప్తంగా దాదాపు 1500 శాఖలు

భారీగా పెరిగిన హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లాభం

Saturday 10th November 2018

ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో భారీగా పెరిగింది. గత క్యూ2లో రూ.68 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 325 శాతం వృద్ధితో రూ.289 కోట్లకు పెరిగిందని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ తెలిపింది. ఆదాయం రూ.2,373 కోట్ల నుంచి 10 శాతం పెరిగి రూ.2,610 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.125 కోట్లుగా ఉన్న ఎబిటా ఈ

Most from this category