STOCKS

News


3వ వారంలో జైట్లీ తిరిగి  బాధ్యతలు!

Wednesday 8th August 2018
news_main1533704003.png-19033

న్యూఢిల్లీ: ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీ ఈ నెల 3వ వారం నుంచీ తిరిగి  బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను పురస్కరించుకుని ఏప్రిల్‌ ప్రారంభం నుంచీ ఆయన ఆర్థికశాఖ కార్యాలయానికి రాలేదు. మే 14వ తేదీన 65 సంవత్సరాల జైట్లీకి ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ జరిగింది. అటు కొద్దిరోజుల తర్వాత అప్పుడప్పుడూ  ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ట్వీట్స్‌ చేస్తున్నప్పటికీ, తాత్కాలికంగా ఆ బాధ్యతలను రైల్వే, బొగ్గు శాఖల మంత్రి పియూష్‌ గోయెల్‌ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జైట్లీ ఆరోగ్యం కోలుకుంటోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.  పోర్టిఫోలియో లేనప్పటికీ క్యాబినెట్‌ మంత్రిగానే ఆయన కొనసాగుతున్నందువల్ల,  ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టగానే జైట్లీ తిరిగి పదవీ ప్రమాణం చేయాల్సిన పనిఉండదు. ప్రభుత్వ సూచనల మేరకు ఆర్థిక శాఖను జైట్లీకి కేటాయిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక ఉత్తర్వు జారీ అయితే సరిపోతుందని సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. 



You may be interested

ఎయిర్‌ ఇండియాకు రూ.11,000 కోట్ల బెయిలవుట్‌ ప్యాకేజీ!

Wednesday 8th August 2018

ముంబై: తీవ్ర కష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సేవల సంస్థ ఎయిర్‌ ఇండియాకు రూ.11,000 కోట్ల బెయిలవుట్‌ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర పౌర విమానయాన శాఖ, ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెప్పాయి. నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇండియాను ప్రైవేటు పరం చేద్దామనుకున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ప్యాకేజీ ఇచ్చే ప్రతిపాదన

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 8th August 2018

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు గ్లెన్‌మార్క్‌ ఫార్మా:- రేయాల్ట్రిస్‌ ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు లభించినట్లు స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. టాటా టెలీసర్వీసెస్‌:- రూ.20వేల కోట్ల నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు ఆగస్ట్‌ 10న బోర్డు సమావేశం నిర్వహించనుంది. పాటిల్‌ ఇంజనీరింగ్స్‌:- రూ.1793.5కోట్ల విలువైన రెండు హైడ్రో ప్రాజెక్ట్స్‌లతో పాటు రూ.618.21 కోట్ల టన్నెల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి మొత్తం రూ.2411.26 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. జీఓసీఎల్‌:-

Most from this category