STOCKS

News


మధ్య తరగతి వారికి మేలు

Saturday 2nd February 2019
news_main1549111058.png-23987

  • రూ.5 లక్షల వరకు ఐటీ మినహాయింపుపై జైట్లీ

న్యూఢిల్లీ: ఈ బడ్జెట్‌లో వార్షికాదాయం రూ.5లక్షల వరకు ఆదాయ పన్ను (ఐటీ) మినహాయింపుతో మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్‌ గోయల్‌ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌ 2019-20 మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా ఉందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారనుందని అన్నారు. ఈమేరకు జైట్లీ తన ఫేస్‌బుక్‌ ఖాతా పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ఇది మధ్యంతర బడ్జెట్‌. ఎన్నికల తర్వాత ప్రభుత్వం భారత్‌ను అసలైన అభివృద్ధి పథంలో నడిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. 2009, 2014 తాత్కాలిక బడ్జెట్‌లలోనూ ఆదాయ పన్నును తగ్గించినట్లు జైట్లీ గుర్తు చేశారు. ఉద్యోగ కల్పనపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ ఉద్యోగ కల్పన లేనిదే ఐదేళ్లలో 7.5 ఆర్థిక వృద్ధి ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ఉద్యోగ కల్పన జరగనపుడు దేశంలో సామాజిక అనిశ్చితి నెలకొంటుందని పేర్కొన్నారు. ‘ భారత్‌ను 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే దశాబ్ద కాలంలోపు భారత్‌ను రెట్టింపు ఆర్థిక వ్యవస్థగా మార్చడం ద్వారా ఆ లక్ష్యాన్ని అందుకుంటాం’ అని జైట్లీ పేర్కొన్నారు.



You may be interested

రూ.5 లక్షలకు పన్ను లేదు... కానీ రిటర్నులు వేయాలి

Sunday 3rd February 2019

రూ.5 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను చెల్లించే అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో మినహాయింపులను పెంచి వేతన జీవులను సంతోషానికి గురి చేసింది. అయితే, రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించక్కర్లేదు కానీ, ఐటీ రిటర్నులు మాత్రం తప్పకుండా ఫైల్‌ చేయాల్సిందే. 60 సంవత్సరాల్లోపు వారికి రూ.2.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఆదాయంగా పరిగణించే నిబంధనలో మార్పు లేదు. రూ.2.5

ఆరోగ్యం..ఆయుష్మాన్‌!

Saturday 2nd February 2019

గతేడాది కన్నా 16 శాతం అధిక కేటాయింపులు మొత్తం రూ.61,398 కోట్లు..అందులో ఆయుష్మాన్‌ భారత్‌కు రూ.6400 కోట్లు 2022 నాటికి 1.5 లక్షల వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటు ఎయిమ్స్‌లకు రూ.3599.65 కోట్లు..ఎన్‌హెచ్‌ఎంకు రూ.రూ.31,745 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: ఆరోగ్య రంగానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.61,398 కోట్లను కేటాయించారు. అందులో రూ.6400 కోట్లను ఆయుష్మాన్‌ ప్రధానమంత్రి జనారోగ్య యోజన(ఆయుష్మాన్‌ భారత్‌కు)కు ప్రత్యేకించారు. గత ఏడాది కన్నా ఈసారి ఆరోగ్య రంగానికి 16 శాతం అధికంగా

Most from this category