STOCKS

News


ఆర్‌బీఐ నిర్ణయంతో మరో ఎన్‌పీఏల షాక్‌?

Friday 22nd March 2019
news_main1553249864.png-24755

ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిస్టుల అంచనా
బలహీనమైన కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు తిరిగి రుణాలిచ్చేందుకు అంగీకరిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆక్స్‌ఫర్డ్‌ ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. ఈ నిర్ణయం సరైన ఆలోచనతో తీసుకున్నది కాదని వ్యతిరేకించారు. ఈ నిర్ణయంతో మరలా వ్యవస్థలో మొండి బకాయిలు పెరుగతాయని, ఈ దఫా వీటి పెరుగుదల అసమాన్యంగా ఉంటుందని హెచ్చరించారు. ఎకానమీలో లిక్విడిటీ పెంచేందుకని చెబుతూ ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ బలహీన పీఎస్‌బీలు రుణాలిచ్చేందుకు అనుమతినిచ్చారు. 2014లో 11 బ్యాంకులపై ఆర్‌బీఐ కఠిన ఆంక్షలు(పీసీఏ) విధించింది. వీటిలో ఐదింటిపై ఆంక్షలు తొలగించారు. ఇలా వీటిని పీసీఏ పరిధి నుంచి తప్పించడాన్ని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిస్టు ప్రియాంక కిశోర్‌ తప్పుబట్టారు. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం చూసుకుంటే దీర్ఘకాలిక ఎదురుదెబ్బలుంటాయని ప్రియాంక వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇండియా మొండిపద్దుల నిష్పత్తి ప్రపంచంలో అధ్వాన్నంగా ఉందన్నారు. ఆర్‌బీఐ తాజా నిర్ణయం భారత్‌లో పెట్టుబడులపై ప్రభావం చూపుతుందన్నారు. దాదాపు 20వేల కోట్ల డాలర్ల ఇక్కట్లలో ఉన్న ప్రభుత్వం బ్యాంకులను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం భారీ మొత్తాలను సాయం కింద అందించింది. పారిశ్రామిక రంగంలో ఎక్కువ మొండిపద్దులున్నందున పీఎస్‌బీలు వీటికి రుణాలిచ్చేందుకు వెనకాడతాయని, దీంతో పెట్టుబడుల వృద్ధి ఆశించినంత పెరగదని, దీంతో భారత్‌ జీడీపీ అనుకున్నట్లు 8-9 శాతాన్ని చేరలేదని ప్రియాంక అభిప్రాయపడ్డారు. 



You may be interested

లాభాల స్వీకరణ-సెన్సెక్స్‌ 222 పాయింట్లు డౌన్‌

Friday 22nd March 2019

11500 దిగువన ముగిసిన నిఫ్టీ 222 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌ ఏడురోజుల సుధీర్ఘర్యాలీ అనంతరం మార్కెట్‌లో శుక్రవారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. నిఫ్టీ 11500 మార్కును కోల్పోగా, సెన్సెక్స్‌ 222 పాయింట్ల మేర నష్టపోయింది. అటో, ఐటీ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరగడంతో సెన్సెక్స్‌ 222 పాయింట్ల నష్టపోయి 38164 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు క్షీణించి 11457 వద్ద స్థిరపడ్డాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను

ఒడిదుడుకుల మార్కెట్లో రియల్టీ షేర్ల ర్యాలీ

Friday 22nd March 2019

ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో రియల్టీ రంగ షేర్లు రాణిస్తున్నాయి. ఈ రంగానికి చెందిన ప్రెస్టేజ్‌ ఎస్టేజ్‌, ఓబేరాయ్‌ రియల్టీ, గోద్రేజ్‌ ప్రాపర్టీ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 2.50శాతం లాభపడింది.  నేడు నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 266 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు లాభస్వీకరణ పూనుకోవడంతో అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైప్పటికీ, రియల్టీ రంగ

Most from this category