STOCKS

News


కేంద్రం- ఆర్‌బీఐ మధ్య మళ్లీ ఉద్రిక్తత?

Wednesday 28th November 2018
news_main1543386622.png-22429

న్యూఢిల్లీ: రుణ మంజూరీపై నియంత్రణలు ఎదుర్కొంటున్న 11 బ్యాంకుల్లో కొన్నింటిని ఆ ఆంక్షల పరిధి నుంచి తప్పించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)పై కేంద్రం ఒత్తిడి తేనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే వాటి నిర్వహణ నిబంధనలను కూడా సమీక్షించాలని కోరనుంది. డిసెంబర్‌ 14న 18 మంది సభ్యుల బోర్డ్‌ సమావేశాల్లో ఈ  అంశంపై చర్చ జరగనుందని ఆ వర్గాలు వెల్లడించాయి. దీనితో ఈ సమావేశాల సందర్భంగా  కేంద్రం-ఆర్‌బీఐ మధ్య తిరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. కాగా బ్యాంకుల మొండిబకాయిలు (ఎన్‌పీఏ) పెరిగిపోకుండా అడ్డుకోడానికి ఒక ప్రణాళికను ఆర్‌బీఐ రూపొందిస్తోందని కూడా అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.  మొండిబకాయిల  భారంతో కూరుకుపోయిన 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు 2016 సెప్టెంబర్‌ 16 నుంచీ ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యల ప్రక్రియ (పీసీఏ) కిందకు వెళ్లాయి. వీటిలో అలహాబాద్‌ బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, యుకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, దేనా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలు ఉన్నాయి. మొత్తం రుణ మార్కెట్‌లో ఈ బ్యాంకుల వాటా 20 శాతం.  



You may be interested

డాలర్‌ రివకరీ : నష్టాల్లో పసిడి ధర

Wednesday 28th November 2018

ఈ వారంలో రెండు రోజులు స్థిరమైన ర్యాలీ చేసిన పసిడి ధర బుధవారం తగ్గుముఖం పట్టింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకోవడం ఇందుకు కారణమైంది. గతరాత్రి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ మినిట్స్‌ సమావేశంలో ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ రిచర్డ్ క్లారిడా మాట్లాడుతూ ‘‘ఫెడ్‌ క్రమక్రమంగా వడ్డీరేట్లను పెంచాలి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతైన అవసరమని’’ తెలిపారు. వడ్డీరేట్లపై పెంపుకు కొంతమేర స్పష్టత రావడంతో రాత్రి

స్వల్పంగా తగ్గిన రూపీ

Wednesday 28th November 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి బుధవారం స్వల్పంగా నష్టపోయింది. ఉదయం 9:15 సమయంలో ఇండియన్‌ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.08 శాతం తగ్గుదలతో 70.85 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మంగళవారం ముగింపు స్థాయి 70.79గా ఉంది. కాగా ఇండియన్‌ రూపాయి బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.81 వద్ద ప్రారంభమైంది.  భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 5 బేసిస్‌ పాయింట్లకు పైగా తగ్గాయి. దీంతో ఈల్డ్స్‌ ఏడు

Most from this category