STOCKS

News


నిర్మాణంలోని ఇళ్లు, ఫ్లాట్లపై జీఎస్టీ తగ్గింపు?

Thursday 3rd January 2019
news_main1546492915.png-23380

- 5 శాతానికి పరిమితం చేసే అవకాశం
- ఈ నెల 10న జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో నిర్ణయం?
రూ.75 లక్షలలోపు టర్నోవరుండే వ్యాపారులకు మినహాయింపు కూడా!!

న్యూఢిల్లీ: నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఫ్లాట్లపై జీఎస్టీని 5 శాతానికి పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనపై జీఎస్టీ కౌన్సిల్‌ ఈ నెల 10న జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటుందని విశ్వసనీయంగా తెలిసింది. డిసెంబర్‌ 22న జరిగిన చివరి సమావేశంలో కౌన్సిల్‌ 23 రకాల వస్తు, సేవలపై పన్ను భారాన్ని తగ్గించటం తెలిసిందే. జీఎస్టీ కౌన్సిల్‌ 32వ భేటీ ఈ నెల 10న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన జరగనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. నివాసిత గృహాలపై పన్ను క్రమబద్ధీకరణను తదుపరి సమావేశంలో పరిశీలించనున్నట్టు జైట్లీ గతంలోనే చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లు లేదా నిర్మాణం పూర్తయి వినియోగానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్స్‌పై.... వాటి నిర్మాణం పూర్తయినట్టు సర్టిఫికెట్‌ జారీ కాకపోతే 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. పూర్తయినట్టు సర్టిఫికెట్‌ తీసుకుంటే, కొనుగోలుదారులపై ప్రస్తుతం జీఎస్టీ లేదు. అయితే, భవన నిర్మాణంలో భాగంగా వినియోగించిన ఉత్పత్తులపై బిల్డర్లు అప్పటికే పన్నులు చెల్లించి ఉంటారు కనుక ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ తీసుకుంటే వాస్తవ పన్ను 5- 6 శాతం మధ్యే ఉంటుంది. అయితే, బిల్డర్లు ఈ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను వినియోగదారులకు బదిలీ చేయడం లేదు. దీంతో కొనుగోలు దారులపై అధిక పన్ను పడుతోంది. ఈ నేపథ్యంలో... బిల్డర్లు నమోదిత డీలర్ల నుంచి భవన నిర్మాణం కోసం 80 శాతం ఉత్పత్తులు కొనుగోలు చేసి ఉంటే, వాటిపై 5 శాతం జీఎస్టీనే విధించాలన్నది తాజా ప్రతిపాదనగా అధికార వర్గాలు తెలిపాయి.
చిన్న వ్యాపారులకు ఊరట లభించేనా?
ప్రస్తుతం జీఎస్టీ విధానం కింద వార్షికంగా రూ.20 లక్షల టర్నోవర్‌ కలిగిన వ్యాపారులకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని రూ.75 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదనపైనా జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోనుంది. విపత్తు సెస్సుతోపాటు చిన్న సరఫరాదారులకు కాంపోజిషన్‌ స్కీమ్‌ను కౌన్సిల్‌ పరిశీలించనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే లాటరీలపై 12 శాతం జీఎస్టీ, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో నడిచే లాటరీలపై 28 శాతం జీఎస్టీ అమలవుతోంది. వీటిని యథావిధిగా కొనసాగించడం లేదా మార్చడం చేయవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.



You may be interested

ఎస్‌బీఐ లైఫ్‌ - సిండికేట్‌ బ్యాంక్‌ జట్టు

Thursday 3rd January 2019

రెండింటి మధ్య బ్యాంక్‌ అష్యూరెన్స్‌ ఒప్పందం బెంగళూరు: సిండికేట్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ల మధ్య బ్యాంకష్యూరెన్స్‌ ఒప్పందం కుదిరింది. ఖాతాదారులకు సమగ్రమైన ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ సొల్యూషన్‌ను అందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు వెల్లడించాయి. ఈ ఒప్పందంపై సిండికేట్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ మృత్యుంజయ్‌ మహాపాత్ర, ఎస్‌బీఐ లైఫ్‌  సీఈఓ, ఎమ్‌డీ సంజీవ్‌ నౌతియాల్‌ సంతకాలు చేశారు. దేశవ్యాప్తంగా 3,000 బ్రాంచ్‌లతో సేవలందిస్తున్న సిండికేట్‌ బ్యాంక్‌ తన బ్రాంచ్‌ల

అటు ఇటుగా బైక్‌ల విక్రయాలు

Thursday 3rd January 2019

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన విక్రయాలు 2018 డిసెంబర్లో మిశ్రమంగా నిలిచాయి. పలు సంస్థల అమ్మకాలు 30 శాతానికి మించి వృద్ధిరేటు నమోదు చేయగా.. మరికొన్ని కంపెనీలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అత్యధిక వాల్యూమ్స్‌ను నమోదు చేస్తున్న హీరో మోటోకార్ప్‌ దేశీ అమ్మకాలు 4 శాతం తగ్గాయి. ఈ అంశంపై స్పందించిన సంస్థ చైర్మన్‌ పవన్‌ ముంజాల్‌.. ‘లిక్విడిటీ (నగదు లభ్యత) కొరత, పెరిగిన ద్విచక్ర బీమా అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపాయి.’

Most from this category