News


‘బేసిక్‌ సేవింగ్స్‌’ ఖాతాలకు మరిన్ని ఉచిత సేవలు

Tuesday 11th June 2019
news_main1560227779.png-26216

  • నిబంధనలను సడలించిన ఆర్‌బీఐ  

ముంబై: బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతాదారులు కనీస సదుపాయాలకు తోడు ఇకపై చెక్‌బుక్‌తో పాటు ఇతర సేవలను కూడా ఉచితంగా పొందే అవకాశం వచ్చింది. ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు కనీస బ్యాలన్స్‌ ఉంచాలని బ్యాంకులు ఇకపై నిర్దేశించకూడదు. ఎటువంటి కనీస బ్యాలన్స్‌ అవసరం లేకుండా నిర్వహించేందుకు వీలున్నవే బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతాలు. చెక్‌బుక్‌తోపాటు ఇతర సదుపాయాలు కోరుకుంటే, బ్యాంకులు కనీస బ్యాలన్స్‌ ఉంచాలని ప్రస్తుతం కోరుతున్నాయి. అయితే, అందరికీ ఆర్థిక సేవలను చేరువు చేసే లక్ష్యంలో భాగంగా, బ్యాంకులు బీఎస్‌బీడీఏను సేవింగ్స్‌ ఖాతాగా కొన్ని రకాల సదుపాయాలను, ఎటువంటి చార్జీల్లేకుండానే అందించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. కనీస సదుపాయాలకు అదనంగా బ్యాంకులు చెక్‌బుక్‌ వంటి విలువ ఆధారిత సేవలను ఉచితంగానే అందించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు బీఎస్‌బీడీఏ నిబంధనలను ఆర్‌బీఐ సడలించింది. ఏటీఎంల నుంచి నెలలో నాలుగు సార్లు ఉచితంగా నగదు ఉపసంహరణ, బ్యాంకు శాఖల్లో డిపాజిట్ల జమ, ఏటీఎం కమ్‌ డెబిట్‌ కార్డు వంటివి బీఎస్‌బీడీఏలకు కనీస సదుపాయాల్లో భాగంగా ఉన్నాయి. 



You may be interested

కస్టమర్లకూ ‘రెపో’ లాభం!

Tuesday 11th June 2019

- తగ్గింపు ప్రయోజనం త్వరలోనే బదలాయింపు - సంప్రదాయక వర్గీకరణ వల్లే ఎన్‌పీఏలు అలా... - బ్యాంకులకు ఏమాత్రం నగదు కొరత లేదు - ప్రతి బ్రాంచిలోనూ కొత్త ఏటీఎం ఏర్పాటు - బ్రోకింగ్‌ కస్టమర్ల కోసం ‘ట్రేడ్‌ - 20’ - ‘సాక్షి’ యాక్సిస్‌ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ రవి నారాయణన్‌ - తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పలు కార్యక్రమాలు - చాలా పథకాలకు అధికారిక బ్యాంకర్లం మేమే సాక్షి, బిజినెస్‌ బ్యూరో ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్‌ పరంగా అనేక

ఏఆర్‌ఎల్‌ టైర్స్‌ కొత్త ప్లాంటు

Tuesday 11th June 2019

రూ.225 కోట్లతో సదాశివపేట వద్ద ఏర్పాటు కంపెనీ సీఎండీ అమిత్‌ కుమార్‌ అగర్వాల్‌   హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఏఆర్‌ఎల్‌ బ్రాండ్‌ పేరుతో టైర్లు, ట్యూబుల తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ అగర్వాల్‌ రబ్బర్‌ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌ సమీపంలోని సదాశివపేట వద్ద 40 ఎకరాల్లో రూ.225 కోట్లతో దీనిని నెలకొల్పుతోంది. 2020 ఏప్రిల్‌ నాటికి ఈ ప్లాంటు సిద్ధమవుతుందని అగర్వాల్‌ రబ్బర్‌ సీఎండీ అమిత్‌ కుమార్‌ అగర్వాల్‌ సోమవారమిక్కడ మీడియాకు

Most from this category